ఐడియా

ఉప్పు ... ఉపకారే! లాభాలు ఎక్కువే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూరల్లో, తినుబండారాలన్నింటిలో ఉప్పు వేయక తప్పదు. కారణం రుచి వుండదు. పప్పులో ఉప్పు లేకపోతే నోట్లో పెట్టుకోలేం అనడం సహజం. ఎక్కువ వేసుకుంటే బి.పి తప్పదు. ప్రత్యేకించి అధిక రక్తపోటు, హృద్రోగాలు, కాళ్ళవాపు, మూత్రపిండాల వ్యాధుల వారుతీసుకుంటే ముప్పే.
ఉపయోగాల గురించి ఆలోచిద్దాం
పదిమందిలో మాట్లాడేటప్పుడు, పాట పాడేటప్పుడు కొందరికి గొంతు పట్టుకుంటుంది. అలాంటివారు చిటికెడు ఉప్పు నాలుకపై వేసుకుని చప్పరిస్తే గొంతు సాఫీ అవుతుంది. తాపంగా వున్నవారికి, నొప్పిపుడుతున్న వేళ్ళను వేడి ఉప్పు కాపడంతో ఎంత రిలీఫ్ వస్తుందో చెప్పలేము. కళ్ళకు ఇన్‌ఫెక్షన్ అయి పుసులు కడుతుంటే, ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో మూడు నాలుగు చిటికెల ఉప్పు కలిపి ఆ ద్రవంలో దూదిని ముంచి దానితో కళ్ళను శుభ్రపరచుకోవాలి. కంజెక్టివైటిస్ వచ్చి కనురెప్పలు అంటుకున్నప్పుడు కూడా అవి విడిపోవడానికి ఈ ఉప్పు ద్రవం ఉపయోగపడుతుంది. నిజానికి యాంటీ బయాటిక్ ఆయింట్‌మెంట్లు గాని, ఐడ్రాప్స్ గాని వాడటానికి ముందుగా కళ్ళను కొద్దిగా ఉప్పు కలిపిన నీటితో శుభ్రంగా కడుక్కుంటే కళ్ళు శుభ్రపడతాయి. చెడుశ్వాస, ఎడతెగని గొంతు నొప్పి, చిగుళ్ళ వాపు వున్నవారు ఉప్పునీటిని పుక్కిలిస్తే చాలా మంచి గుణం ఇస్తుంది.
ఉప్పు కలిపిన నీళ్లను యాంటీ సెప్టిక్‌గా ఉపయోగించవచ్చు. ఇంట్లో మరో యాంటీ సెప్టిక్ ఏదీ లేకపోతే రసి కారే పుండ్లను ఉప్పు నీటితో కడగవచ్చు. బేండేజ్‌గాని, బట్టగాని పుండుకు అంటుకుపోతే గోరువెచ్చని ఉప్పునీటితో కొన్ని నిమిషాలపాటు కడిగితే ఊడివచ్చేస్తుంది. ఏ బాధా వుండదు.
ఈ కాలంలో పరీక్షలు తప్పి కుర్రాళ్ళు, ప్రేమలో విఫలమైన యువతీ యువకులు, జీవితంపై విరక్తి కలిగి, సంతానం పెట్టే బాధలు తట్టుకోలేక విషాహారం తిన్నవారికి వాంతి అవడానికి ఉప్పు బాగా ఉపయోగపడుతుంది. డాక్టర్ల దగ్గరకు వెళ్ళడానికి తగు వాహనముగాని, ఎవ్వరి సాయం లేనప్పుడుగాని ఈ నిరాశోపహతులకు గ్లాసు నీళ్లలో మూడు, నాలుగు స్పూన్ల ఉప్పు కలిపి తాగిస్తే కొన్ని నిముషాల్లో వాంతి అవుతుంది. రిలీఫ్ కలిగి తేటతనం వచ్చిన తర్వాత ఒక కప్పు కాఫీ ఇస్తే మామూలు మనుషులవుతారు. వేసవికాలంలో విపరీతంగా చెమట పట్టిన తర్వాత కాళ్ళు తిమ్మిరెక్కితే ఒక కప్పు గ్లూకోజ్ నీళ్ళలో అర స్పూన్ ఉప్పు కలిపుకొని తాగాలి. ఒక్క పది నిమిషాల్లో తిమ్మిర్లు మాయవౌతాయి. గుమ్మడికాయ గింజలను పారవేసేకంటే వాటిని కొంచెం వేయించి ఉప్పు, కారం, పులుసు చేసి చట్నీ నూరుకుంటే ఎంతో రుచిగా వుంటుంది. దానిలో ఎక్కువ ఉప్పు వేస్తే పులుపును చంపి మహారుచికరంగా తయారౌతుంది.

- బి.విజయలక్ష్మి