ఐడియా

మోచేతులపై నలుపు ఇలా పోగొట్టండి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత తెల్లగా ఉన్నవారికైనా మోచేతులు, మోకాళ్లపై నల్లగా, గరుకుగా ఉంటుంది. చూడటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ నలుపుపోవాలంటే ఇలా చేయండి.
రాత్రి పడుకోబోయే ముందు మోకాళ్లకీ, మోచేతులకీ ఖచ్చితంగా ఆలివ్ ఆయిల్ లేదా ఆముదం నూనెతో మర్దన చేసుకుని నిద్రపోండి. ఈ నూనెలు చర్మం ముడతలు పడడాన్ని తగ్గిస్తాయి.
మూడు స్పూన్ల బొరాక్స్ పొడికి, రెండు స్పూన్ల రోజ్‌వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని మోకాలికీ, మోచేతులకీ రాసుకుని పావుగంట ఆగి,వేడి నీళ్లతో కడిగేసుకోండి. ఇలా తరుచూ చేస్తుంటే నలుపు తగ్గి చర్మం నునుపు లేలుతుంది. గుడ్డులోని తెల్లసొనకు టీ స్పూను పంచదార, అరస్పూను జొన్నపిండి కలిపి దానిని గరుకుగా ఉన్నచోట రాసుకుని, ఆరాక శుభ్రపరుచుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
నిమ్మచెక్కతో మోచేతులూ, మోకాళ్ల దగ్గర రుద్ది పావుగంట సేపు వదిలేయాలి. వేడినీళ్లలో ముంచిన టవల్‌తో గట్టిగా తుడవాలి. అలాగే ఒక టీ స్పూను కొబ్బరి నూనెకి, అర టీ స్పూను నిమ్మరసం కలిపి జాయింట్ల దగ్గర రుద్ది, పైవిధంగానే వేడి టవల్‌తో తుడిచేయాలి. కొబ్బరినూనెకి వాల్‌నట్ పొడిని కలిపి తరుచూ రాస్తున్నా మంచి ఫలితమే ఉంటుంది. లేదా మీగడకి , పసుపు కలిపి స్క్రట్‌లా రోజూ వాడవచ్చు. రెండు స్పూన్లు పెరుగుకి కొంచెం బాదం పొడిని కలిపి రాసుకున్నా మంచిదే.