ఐడియా

పరవౌషధం పసుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసుపు మానవుడు ఉపయోగించిన అతి పురాతన ఔషధం. క్రీస్తుపూర్వం వెయ్యి నుంచి పదిహేను వందల సంవత్సరాల కిందటే, ఆధర్వణ వేదకాలంలోనే పసుపును పరమ పవిత్రంగా పరిగణించేవారు. ఐదువేల ఏళ్ళ చరిత్రగల అధ్వరణ వేదం పసుపు వైద్య గుణాలను గురించి విపులంగా వివరిస్తోంది.
భారత్‌తోపాటు తదితర దేశాల్లో పసుపును రకరకాలుగా వినియోగిస్తూ వస్తున్నారు. తలనొప్పి, శరీర అవయవాలకు దెబ్బతగలడం, బెణకడం, వాచిపోవడం, తెగిన గాయాలు, ఇతర ఇన్‌ఫెక్షన్లకు పసుపు లేపనం పరవౌషదంగా పనిచేస్తుంది. తేలు, పాముకాటు, మొటిమలు, జలుబు నివారణకు కూడా పసుపు మందుగా పనిచేస్తుంది. పసుపును మందుగా సేవించడం ద్వారా కడుపు ఉబ్బరం, అజీర్తి, విరేచనాల నయం చేసుకోవచ్చు. కాలేయం సంబంధమైన వ్యాధులు, ఆకలి మందగించడం తదితర రుగ్మతలను కూడా నివారించవచ్చు.
పసుపు కొమ్ములు పొగబట్టడం ద్వారా సైనసైటిస్, జలుబు, పడిశం, మూర్ఛ వంటి రోగాలను దూరం చేయవచ్చు. కాన్పు తర్వాత కీళ్ళవాపుతో బాధపడే మహిళలకు పసుపును ఆవనూనెతో కలిపి మర్థన చేసి ఉపశమనం కలిగించవచ్చు. పసుపు ఎండిన అల్లం కలిపిన చూర్ణాన్ని చక్కెరతో కలిపి సేవించినవారికి కీళ్ళవాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అప్పుడే పుట్టిన శిశువును తల్లినుంచి వేరు చేసినపుడు బొడ్డు పేగును తెంపుతారు. అయితే ఇలా తెంపిన చోట ఇన్‌ఫెక్షన్ వచ్చి పుండుగా మారకుండా నివారించేందుకు భారతీయ గ్రామీణ ప్రజలు పసుపు లేపనాన్ని పూసేవారు. అంటే పసుపును ఇలా యాంటీ సెప్టిక్ ఔషధంగా ఉపయోగించేవారు. కాలి వేళ్ళ పుండ్లను నయం చేయడానికి పసుపు, గోధుమ పిండి, ఆముదం ఉప్పు కలిపి ఉడకబెట్టి పుండు వున్నచోట కట్టేవారు.
సంప్రదాయ పశువుల వైద్యంలో కూడా పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. తాజా పసుపు కొమ్ములు, వెల్లుల్లి కలిపి నూరిన మిశ్రమాన్ని నీటిలో కలిపి కొత్తగా పుట్టిన కోడిపిల్లలకు ముందుగా తాగించేవారు. పశువుల గాయాలను, పుండ్లను నయం చేయడానికి పసుపు, నెయ్యి, పెట్రోలియం, జెల్లీలతో కూడిన లేపనాన్ని ఉపయోగిస్తారు. పసుపు, వేపాకు మిశ్రమంతో తయారుచేసిన పేస్టును పశువుల ఇన్‌ఫెక్షన్లు, ఎగ్జిమా, దురదలను నయం చేయడానికి వాడతారు. ప్రాచీన కాలంలో గ్రామీణులు వాడిన పసుపు ఔషధానికి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యం ఇస్తున్నారు. వివిధ రకాల రుగ్మతలను నయం చేసే లక్షణాలు పసుపుకు ఉన్నాయని ఆధునిక ప్రపంచం గ్రహించింది. పసుపు, దాని సంబంధిత పదార్థాలు వైద్య చికిత్సతో ఏ విధంగా ఉపయోగపడతాయన్న అంశంపై ఇప్పుడు ప్రయోగాలు అరుదుగానే జరుగుతున్నాయి. అయితే పసుపు ప్రాతిపదికగా రూపొందించే ఔషధాలు మార్కెట్‌లో కనిపించే రోజు ఎంతో దూరంలో లేదు.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- బి.మాన్‌సింగ్ నాయక్