ఐడియా

కరివేపాకుతో కురులకు మెరుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూరలో కరివేపాకులా తీసిపారేయకండి అని ఇంట్లోని పెద్దవాళ్లు అంటుంటారు. ఈ నానుడు నిజమే కావచ్చోమోకానీ వాస్తవంగా పప్పు తాలింపులో కరివేపాకు ఉంటే కమ్మటి అదనపు రుచి వస్తోంది. కూరల తాలింపులో కరివేపాకు లేకుండా ఉండదు. మరి ముఖ్యంగా దక్షిణాది వంటకాల్లో ఇది తప్పనిసరి. కరివేపాకు వల్ల అనేక అనారోగ్య సమస్యలు దరిచేరవనేది ఆయుర్వేద పరిశోధనల్లో సైతం వెల్లడైంది. లివర్, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోంది. కొలెస్ట్రాల్, రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది.
కురులకు పోషకాలు
కరివేపాకును ప్రతిరోజూ తీసుకోవటం వల్ల దీర్ఘకాలంలో కురులు సంరక్షణకు ఉపకరించే పదార్థంగా పనిచేస్తుందంటున్నారు వైద్య నిపుణులు. బైద్యనాథ్‌కు చెందిన క్లినికల్ ఆపరేషన్స్, కోఆర్డినేషన్ మేనేజర్ డాక్టర్ అశుతోష్ గౌతమ్ దీని విశిష్టత గురించి చెబుతూ ఆయుర్వేద పరిశోధనల్లో ఇది కురుల్లో ని చుండ్రును లేకుండా చేస్తుందని తేలినట్లు వెల్లడించారు. జుట్టుకు సంబంధించిన ఎలాంటి ఇన్‌ఫెక్షన్లనైనా దరిచేరనివ్వదని, ఓవిధంగా యాంటీబాక్టీరియల్‌గా ఉపకరిస్తుందని అంటున్నారు. రక్తంలో ఐరన్, హిమోగ్లోబిన్ లెవల్స్‌ను పెంచటానికి కరివేపాకు మించింది మరొకటి లేదని ఢిల్లీకి చెందిన డాక్టర్ నమ్రత చెబుతున్నారు. దక్షిణాది మహిళల కురులు నల్లగా, పొడవుగా, దృఢంగా ఉండటానికి కారణం వారు ప్రతిరోజూ కూరల్లో కరివేపాకును వేయటమేనని అంటారు. కురులకు అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, కెరొటెన్ తదితర వాటిని అందిస్తుందన్నారు.
ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోమని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీలో ఒకటి లేదా రెండు ఆకులు కలుపుకుని తాగమంటున్నారు. కరివేపాకు పేస్ట్ లేదా పౌడర్‌ను అన్నంలో కలుపుకుని తింటే మంచిది.
జుట్టుకు హెయిర్ మాస్క్ లేదా ఆయిల్ రాసుకుంటే అందులో కరివేపాకు ఆకులను కలుపుకుంటే ఎంతో మంచిది. కొబ్బరి నూనెలో కరివేపాకులు వేసి కొద్దిగా వేడిచేసుకుని రాసుకుంటే మంచిది. హెయిర్ మాస్క్‌లో టీ స్పూన్ కరివేపాకు పేస్ట్ లేదా పొడి కలుపుకుని వేసుకోవచ్చు. అలాగే తలస్నానం చేసేటపుడు సీకాయ, కుంకుడు కాయల్లో కరివేపాకు ఆకులు కలుపుకుని ఆ రసంతో తలంటుకుంటే విశేషంగా పనిచేస్తోంది.
నిమ్మకాయ రసంలో కరివేపాకు పేస్ట్ కలుపుకుని రాసుకుంటే జుట్టు నల్లగా నిగనిగలాడుతోంది. మెంతి గింజలకు కరివేపాకు ఆకులు కలిపి రుబ్బి రాసుకుంటే చుండ్రు దరిచేరదు. ఇన్నీ ఉపయోగాలున్న కరివేపాకును కూరల్లో వచ్చినపడు కూరతో పాటు తినేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఢిల్లీకి చెందిన స్కిన్, హెయిర్ వైద్య నిపుణులు డాక్టర్ దీపాలి భరద్వాజ్.