ఐడియా

అల్సర్‌కు అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరక్కాయ గృహ వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది. కరక్కాయలో ఏడు రకాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు తెలియజేశారు. అవి అభయ, అమృతా, జీవంతీ, విజ యా, పూతనా, రోహిణీ, చౌతకీ అనే పేర్లతో ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యపరంగానూ, ఔషధ పరంగానూ ఉపయోగించేవే. ఇది రుచికి వగరుగా, ఘాటుగా, కారంగా, చేదుగా ఉంటుంది.
కరక్కాయ బెరడును మెత్తగా దంచి, ఆ పొడిలో బెల్లం పొడిని కలిపి తింటే అల్సర్ వ్యాధి పోగొడుతుంది. గొంతునొప్పి, గొంతు బొంగురు నివారణకు ఉపకరిస్తుంది. తేనెలో కరక్కాయ చూర్ణాన్ని కలిపి ఔషధంలా పుచ్చుకుంటే వాంతులు తగ్గిపోతాయి. కడుపు ఉబ్బరాన్ని నివారిరించి, మలబద్ధకాన్ని పోగొడుతుంది. కామెర్లకు ఔషధంలా పనిచేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని వృద్ధిచేస్తూ, కంటిచూపును పెంచుతుంది. గుండె చక్కగా పనిచేయటానికి తోడ్పడుతుంది. వాతాన్ని హరిస్తుంది. ఉబ్బసాన్ని తగ్గిస్తుంది. కఫాన్ని కరిగిస్తుంది. బుద్ధినీ ఉత్సాహాన్నీ, చురుకుదనాన్ని పెంచుతుంది. క్రిములను నాశనం చేస్తుంది. కరక్కాయను అరగదీసి, ఆ గంధాన్ని నుదుటికి పట్టించుకుంటే తలనొప్పికి ఉపశమనం కలుగుతుంది. రాత్రంతా కరక్కాయను గోరువెచ్చని నీళ్ళలో నానపెట్టి, ఉదయం ఆ నీటితో కళ్ళు తుడుచుకుంటే కండ్లకలక, కంటి ఎరుపు తగ్గిపోతాయి. కరక్కాయను కాల్చి, ఆ చూర్ణంలో ఉప్పును కలిపి ఆ పొడిని అన్నంలో మొదటి ముద్ద లో కలుపుకుని తింటే అజీర్ణ వ్యాధులు తొలగిపోతాయి. మతిమరుపును పోగొట్టి, జ్ఞాపశక్తిని పెంచుతుంది. కీళ్ళనొప్పులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. కరక్కాయ నూనె జీర్ణశక్తికీ, అరుగుదలకూ తోడ్పడుతుంది.
పళ్ళపొడి, పేస్టు తయారీలో కరక్కాయ గుజ్జును వాడుతారు. కరక్కాయ ఆయుర్వేద వైద్యంలో వాడబడుతోంది. కొన్ని పరిశ్రమలలో కరక్కాయ వాడబడుతున్నాయి.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- కె.నిర్మల