ఐడియా

భార్య చిరునవ్వే భర్తకు ఆరోగ్యం ( మానసిక శాస్తవ్రేత్తల పరిశోధనలో వెల్లడి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇంటికి దీపం ఇల్లాలే’ అన్నారు మన పెద్దలు. వాస్తవంగా కూడా ఇది అక్షర సత్యమని శాస్ర్తియంగా నిరూపించారు మిచిగన్ విశ్వవిద్యాలయంకు చెందిన మానసిక శాస్తన్రిపుణులు. ఇల్లాలు చిరునవ్వుతో ఉంటే, భర్త ఆరోగ్యం మెరుగ్గా వుంటుందని పరిశోధనలో తేలింది. మిచిగన్ విశ్వవిద్యాలయంకు చెందిన మానసిక శాస్త్ర నిపుణులు భార్యాభర్తల ఆరోగ్య పరిస్థితులపై పరిశోధనలు నిర్వహించారు. ఆరు సంవత్సరాలపాటు 1981 మధ్య వయస్సు జంటలుపై (50-94 సం.ల వయసు మధ్య) ఈ పరిశోధనలు చేశారు. మధ్యవయస్సు (50 సంవత్సరాలనుంచి)ను మానసిక శాస్తన్రిపుణులు గోల్డెన్ ఇయర్స్‌గా పేర్కొంటారు. ఆనందం (సంతోషం), ఆరోగ్యంల మధ్య అవినాభావ సంబంధం ఉదంటున్నారు మానసిక శాస్తన్రిపుణులు. ముఖ్యంగా మధ్య వయస్సులో భర్త ఆరోగ్యంగా ఉండాలంటే, సదరు వ్యక్తి భార్య చిరునవ్వుతో భర్తతో వ్యవహరించాలని వారు సూచిస్తున్నారు.
సంతోషకరమైన జీవితం సాగించే దంపతులకు సమాజం నుంచి కూడా మంచి మద్దతు లభిస్తుందని పరిశోధనలో వెల్లడి అయింది. ఈ విధంగా జీవనం సాగించే దంపతులలో భార్య తన భర్త గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటుంది. అంతేకకుండా, వీరు ఆరోగ్యరమైన (పౌష్టిక) ఆహారం తీసుకోవడం, మంచి నిద్రపోవడం, తగిన వ్యాయామం చేయడం చేస్తారు. చిర్రుబుర్రులాడే లేదా గయ్యాళి భార్యలు ఉన్న భర్తలు మానసిక ప్రశాంతతను కోల్పోవడమే కాకుండా, మద్యపానం, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలై, తమ ఆరోగ్యాన్ని తామే నాశనం చేసుకొంటున్నారని పరిశోధనలో వెల్లడి అయింది. ఈ పరిశోధనా ఫలితాలను అమెరికన్ సైకాలజీ అసోసియేషన్ ప్రచురించే హెల్త్ సైకాలజీలో ప్రచురించారు. దంపతుల మధ్య సరైన అవగాహన లేదా సఖ్యత లేకపోతే, వారు ప్రతి విషయాన్ని ఒక సమస్యగా చూస్తారు. దీనివలన ఇరువురు తీవ్రమైన వత్తిడికి గురవుతున్నారు. వత్తిడి ఇరువురి ఆరోగ్యంమీద తీవ్ర ప్రభావం చూపుతుంది.
ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది అనడానికి ఈ పరిశోధనను ప్రత్యక్ష ఉదాహరణగా తీసుకోవచ్చు. ‘సంతోషం సగం బలం’ అన్న నానుడికి కూడా శాస్ర్తియత ఉందని ఈ పరిశోధన నిరూపించారు. మధ్యవయస్సులోనే సాధారణంగా పలువురు అనారోగ్యానికి గురవుతారు. మధ్యవయస్సులో ఉన్న మహిళలారా మీ భర్తలు ఆరోగ్యంగా ఉండాలంటే, వారిని చిరునవ్వుతో ఆదరించండి.

-పి.హైమావతి