ఐడియా

సంపూర్ణ ఆరోగ్యానికి సూర్య నమస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యుని లేత కిరణాల ద్వారా శరీరానికి డి విటమిన్ అందుతుంది. పల్లెటూళ్లలో ఆరుబయట పనులను చేయడంవల్ల సూర్య కిరణాలు శరీరం మీద ప్రసరిస్తాయి. దాని నుంచి లభించే శక్తివల్ల శరీరం చురుకుగానూ, ఉత్సాహంగానూ వుంటుంది. ఇప్పటికీ పెద్దవారైన స్ర్తి పురుషులు సూర్యనమస్కారాలు చేయడం గమనించవచ్చు. కొంతమందికి సూర్యుని దర్శించనిదే పూజ చేయకూడదన్న దీక్ష ఉంటుంది.
సూర్య నమస్కారాలు సాధారణంగా ఉదయం వేళలోనే చేస్తారు. నిజానికి లేత సూర్య కిరణాలు శరీరానికి ప్రసరించడం వల్ల క్షయ, టైఫాయిడ్, న్యుమోనియ, సిఫిలిస్ లాంటి వ్యాధులను తగ్గించటానికి సూర్య కిరణాలు సాయపడతాయి. చర్మ సంబంధిత అనారోగ్యాలు ఏర్పడవు. అయితే లేత ఎండ మాత్రమే మంచిది. తీక్షణమైన ఎండ, మధ్యాహ్నపు ఎండలో ఎక్కువ సమయం గడపటం చర్మం, శిరోజాల ఆరోగ్యానికి మంచిది కాదు. సూర్య స్నానం ఆచరిస్తే చర్మ సంబంధిత అనారోగ్యాలు తగ్గిపోతాయి. ఎముకలు దృఢపడతాయి. ఎర్ర రక్తకణాలు వృద్ధి చెందుతాయి. సూర్య స్నానం ఎప్పుడు చేయాలన్న విషయం పట్ల సరైన అవగాహన ఉండాలి. వేసవిలో ఎండ పెరగక ముందే ఉదయం సమయంలో సూర్య నమస్కారం చేయాలి. చలికాలంలో ఉదయం కానీ, సాయంత్రం కానీ సూర్యస్నానాన్ని చేయవచ్చు. ప్రతిరోజూ తప్పనిసరిగా సూర్యస్నానాన్ని ఆచరించేవారికి ఆరోగ్య సమస్యలు ఏర్పడవు. సూర్యస్నానం ఆచరించటానికి పెద్దలు ఏర్పరచిన నియమాలేమిటో తెలుసుకోవటమే కాకుండా వాటిని తప్పనిసరిగా పాటించాలి.
సూర్య స్నానం చేసేటప్పుడు తలమీద టోపీ కానీ, బట్టను చుట్టటం చేసి తలకు ఆచ్ఛాదన కలిగించాలి.
అరగంట నుంచి గంటలోపుగా ఉండాలి.
సూర్యుని కిరణాలు శరీరానికి తగిలేటట్లుగా చూసుకోవాలి.
చర్మాన్ని బట్టలు కప్పేసేట్లుగా ఉండకూడదు. పలుచని కాటన్ బట్టలను మాత్రమే ధరించాలి.
సూర్య స్నానానికి ఉదయపు వేళను ఎన్నుకోవడమే మంచిది.
సూర్య స్నానం ఆచరించిన వెంటనే చిరాకుగా ఉందని వెంటనే స్నానం చేయకూడదు. శరీరానికి ఆలివ్ ఆయిల్ లేదా నువ్వుల నూనెను పట్టించి చర్మానికి కొంత సమయం మసాజ్ చేసిన తర్వాత స్నానం చేయాలి. అప్పుడే శరీరానికి సూర్య స్నాన ప్రయోజనం చేకూరుతుంది.
సూర్య కిరణాల వేడిని తట్టుకోలేమనిపిస్తే, శరీరానికి ఆయిల్‌ను రాయవచ్చు.
సూర్యస్నానం తర్వాత తలనొప్పిగా అనిపిస్తే, ఎక్కువ సమయం ఎండలో ఉండకపోవడమే మంచిది.
నీరసం, నిస్త్రాణ లాంటివి ఏర్పడితే శరీరానికి పోషకాహారాన్ని అందిస్తూ సూర్య స్నానపు సమయాన్ని తగ్గించాలి.
పాపాయిలకు లేత ఎండలో ఆరు బయట స్నానం చేయించడం మంచిది.
అప్పుడే పుట్టిన పసికందుకు కామెర్లు సోకితే పాపాయిని ఉదయపు లేత ఎండలోకి తీసుకెళ్లమని వైద్యులు సూచిస్తున్నారు.
సూర్యుని లేత కిరణాల ప్రభావం శరీరానికి సోకితే, వారికి నూతన ఉత్సాహాన్ని, శక్తినీ చురుకుదనాన్ని కలిగిస్తాయి.
ప్రకృతి, ఆయుర్వేద వైద్యంలో కూడా కొన్ని అనారోగ్యాలకు చికిత్సగా సూర్యస్నానాన్ని ఆచరించమని, సూర్య నమస్కారాలు చేయమని వైద్యులు రోగులకు సలహాలనిస్తున్నారు. సూర్యోదయ, సూర్యాస్తమయాలు మంచిదనీ, మధ్యాహ్నపు ఎండ, తీవ్రమైన వేసవి ఎండ మంచివి కావనీ తెలుసుకోవాలి. బాగా ఎండగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళేవారు చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ ఆయిల్‌ను రాసుకోవాలి.

- కె.నిర్మల