ఐడియా

పొట్ట తగ్గాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొట్ట్భాగంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయంతో బాధపడేవారు ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే కొద్ది రోజుల వ్యవధిలోనే కచ్చితమైన మార్పును చూస్తారని వ్యాయామ నిపుణులు అంటున్నారు. రోజూ కొంతసేపు వ్యాయామం చేస్తున్నా ఫలితం కనిపించడం లేదంటే- సరైన పద్ధతులు పాటించలేదని భావించాల్సి ఉంటుంది. నేలపై అరచేతులు, కాళ్లు ఆన్చి ముందుకు, వెనుకకు వంగడం, నిలబడి ముందుకు, వెనుకకు వాలడం, నేలపై బోర్లా పడుకుని పొట్ట భాగాన్ని కిందకు, మీదకు లేపడం వంటి వ్యాయామాలను వారంలో కనీసం నాలుగైదు సార్లయినా చేస్తుండాలి. ఇలాంటి వ్యాయామాలను రోజూ కనీసం అరగంట సేపు చేస్తుంటే పొట్ట్భాగంలో కొవ్వు తగ్గుతుంది. సులువైన యోగాసనాలను నిత్యం అభ్యసించడం వల్ల కూడా ఊబకాయం తగ్గుముఖం పడుతుంది. భోజనం చేసిన తర్వాత కనీసం పది నిమిషాల సేపు అటూ, ఇటూ నడవడం మంచిది. రోజూ 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగితే శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. కొవ్వు తగ్గాలంటే ముఖ్యంగా అధిక కాలరీలు కలిగిన జంక్‌ఫుడ్‌కు స్వస్తి పలకాలి. కేకులు, కుకీలు, చిప్స్, ఐస్‌క్రీములను తినడం మానేయాలి. తీపిని పూర్తిగా తగ్గిస్తే కొవ్వు సమస్య నుంచి చాలావరకూ ఉపశమనం లభిస్తుంది. ఫాస్ట్ఫుడ్, ప్యాకేజీ ఫుడ్‌కు బదులు పీచు పదార్థాలను పుష్కలంగా అందించే తాజా కూరలు, పండ్లు, గింజలు, చిరుధాన్యాలను తీసుకోవడం ఉత్తమం.