ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వరుసగా ఆఫీస్‌కు ఐదారు రోజులు సెలవులు పెట్టారా? మూడు రోజుల్లో మీ ముఖ్యమైన పనులు పూర్తిచేసుకోండి. మిగతా రెండు రోజులు ఇంటిపని పట్టండి. మీకు తెలియకుండానే ఫైళ్లు, బీరువాలు, కబోర్డుల్లో, ఇంట్లోని మూలల్లో చెత్త కాగితాలు పనికిరాని పుస్తకాలు, పేపర్లు పేరుకుపోయి వుంటాయి. అలానే మీ మనీ పర్సులో కూడా.. వీటిని ఆ రెండు రోజుల్లో క్లీన్ చేసేసుకోండి. మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది.
* ఇంటి అందం కోసం పూలకుండీలు, అందులో అందాన్నిచ్చే మొక్కలు పెంచుతుంటాం. కానీ ఆ కుండీల్లో నీరు ఉండకుండా చూసుకోండి. అలాగే ఫ్రిజ్ వెనుక నీటికోసం చిన్న ప్లాస్టిక్ డబ్బాలాంటిది ఉంటుంది. అందులో కూడా నిల్వ ఉండకుండా చూసుకోండి. డాబాపైనా, చుట్టుప్రక్కల పనికిరాని టైర్లలో, డబ్బాల్లో, కొబ్బరి చిప్పల్లో, చివరకు మీ ఇంటి ముందున్న మురికి కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తగా ఉండండి. లేదంటే దోషులు విజృంభించి, వ్యాధులను అంటగడతాయి. అలాగే మీ ఇంటిపై వున్న వాటర్ ట్యాంకును నెలకోమారు బ్లీచింగ్‌తో శుభ్రం చేయించుకోండి.

-జి.కల్యాణి