ఐడియా

పట్టులాంటి జుట్టుకోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రబంధాలలో స్ర్తిల కేశాల్ని గురించి ఎన్నో వర్ణనలు ఉండేవి. తుమ్మెద రెక్కల్లాంటి జట్టు అని, వంకీల జుట్టు అని వర్ణించేవారు. ఇక మహిళల జుట్టు పరిరక్షణకు చేయవల్సిన చిట్కాలు- వారం వారం ప్రత్యేకించి శుక్రవారం స్ర్తిలు తలంటు లేక అభ్యంగన స్నానము చేస్తారు. శుభప్రదమని, లక్ష్మీ కటాక్ష ప్రాప్తికని- ఇలా ఎన్నో సెంటిమెంట్లు!
తలంటు పోసుకునే ముందు రోజు రాత్రి నీళ్ళలో ఐదు చెంచాల మెంతులు నానవేసి దానిలో ఒక గుప్పెడు మందార ఆకులను కలిపి మెత్తగా పేస్ట్‌లా రుబ్బుకోవడంగాని, లేక మిక్సీలో వేసుకొనిగాని, విడిగా వుంచుకోవాలి. ఈ రుబ్బిన మిశ్రమాన్ని జుట్టును పాయలు పాయలుగా విడదీస్తూ తలకి బాగా అంటేటట్లు రాయాలి. జుట్టు అంతటికీ మర్దన లైట్‌గా రాసుకోవచ్చు. ఆ తరువాత జుట్టును ముడివేస్తూ ఒక గంట తర్వాత కుంకుడు రసం లేక సీకాకాయతో తలంటుకోవాలి.
తలంటు తర్వాత జుట్టును ముడివేస్తూ తర్వాత ఒక టవల్‌తో గట్టిగా బిగించాలి. తర్వాత విడదీసి మృదువుగా వుంచుకోవాలి. జుట్టును చిక్కులు విడదీసేటప్పుడు వెడల్పు పళ్లుగల ఒక ఫ్రెష్ దువ్వెనతో నెమ్మదిగా దువ్వుకుంటూ వుండి కాసేపు తర్వాత సన్నని పళ్లుగల దువ్వెతో దువ్వుకుంటూ జుట్టు బాగా ఆరాక శిరోజాలంకరణలు చేసుకోవాలి.
వాసన లేని పూలు పెట్టుకుంటే పేలు పడే అవకాశం ఉంది. సువాసనగల పూలు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. మందార పూలను మాడుకు బాగా రుద్దుకోవాలి. ఇలా ప్రతిరోజూ కూడా చేసికోవచ్చు తీరిక వుంటే. ఏమైనా పార్టీల్లాంటివాటికోసం పిన్నులతో హెయిర్ స్టైల్ వేసుకుంటే రాగానే పిన్నులను అన్నీ తీసివేసి జుట్టు చక్కగా నెమ్మదిగా చిక్కు విడదీసి జడ అల్లుకోకుండా కనీసం ఒక గంట ఆరనివ్వాలి.
జుట్టు నాలుగు కాలాలపాటు నల్లగా, స్వచ్చంగా వుండాలంటే వాస్‌లైన్లు, పోమేడ్‌లు, హెయిరాయిల్స్, షాంపులు వాడరాదు. కల్తీలేని కొబ్బరినూనె జుట్టు కుదుళ్ళలోనికి రోజూ మర్దన చేసుకోవాలి.
నూనె రాసుకొని బాగా రుద్దుకొని తర్వాత కుంకుడుకాయ రసంతో తలంటుకొని జుట్టు తడిలేకుండా చూసుకొని సాంబ్రాణి పొగ వేసుకొంటే జుట్టు సువాసనలతో ఆనందంగా వుంటుంది. ఇప్పుడు తడి జుట్టును వేడి చేసే హెయిర్ డ్రయ్యర్లు వస్తున్నాయి. కాని అవి చిక్కుముడులు సృష్టించవచ్చు. జాగ్రత్తగా వాడుకోండి. రోజూ ఆకుకూరలు, న్యూట్రిషన్ ఫుడ్, మిటమిన్స్‌తో కూడిన పదార్థాలతో భోజనం చేయాలి. ఆయా ఋతువుల్లో వచ్చే పళ్లు తినాలి. రోజూ అరటి ఆకులో భోజనం చేస్తే తల నెరవదని ఆయుర్వేద భిషగ్వరులు చెబుతారు. చింత, చికాకులు, స్ట్రెస్, కలతలు లేకుండా నియంత్రణతో మనస్సును స్వాధీన పర్చుకొని యోగా కూడా చేయవచ్చు. తలకు రంగులు అనారోగ్యహేతువు.

-బి.విజయలక్ష్మి