ఐడియా

వేసవి చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వేసవిలో దాహం వేసినపుడు మంచినీటినే తాగండి. కూల్‌డ్రింక్స్ తాగినా అవి తాత్కాలికంగా దాహం తీర్చినా.. రక్తంలోకి నీటిలా అవి చేరవు.
* ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. వేసవిలో వెల్లుల్లిని దగ్గర ఉంచుకుంటే ఎంతో మంచిది. వడదెబ్బ తగిలిన వ్యక్తికి వెల్లుల్లి లేపనాన్ని కణతల వద్ద, గుండెకు బాగా రాయాలి.
* ఈ కాలంలో పెరుగువాడటం చాలా మంచిది. చల్లదనం కలిగించడమే కాకుండా పౌష్టికాహారంగా పనిచేస్తుంది.
* ప్రతిరోజూ కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలి. స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కలు వెనిగర్‌ను వేస్తే చెమట వాసన ఉండదు.
* ముఖానికి నిమ్మరసం రాసుకుని అరగంట ఆగి గోరు వెచ్చని నీటితో కడిగితే ముఖం ఫ్రెష్‌గా ఉంటుంది.
* ఎండుద్రాక్ష, ఖర్జూరం నానబెట్టుకుని ఆ నీళ్లను రోజూ తాగితే మంచిది.
* ఈ రోజు రేపు అంటూ వాయిదా వేసే వ్యాయామాన్ని ప్రారంభించటానికి వేసవి కాలం అనువైనదని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు.
* ఎంత ఇష్టం ఉన్నా పిజ్జా, బర్గర్ వంటి బేకరీ ఐటెమ్స్‌కు దూరంగా ఉంటే మంచిది. వేసవిలో వచ్చే మధుర మామిళ్లను ఆరగిస్తూ, తాటిముంజల రుచిని ఆస్వాదిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండవచ్చు.
వేసవి కాలంలో లభించే పుచ్చ, కీర దోసకాయ వల్ల శరీరంలో నీటి శాతం పెరగటంతో పాటు అవసరమైన పోషకాలు అందే అవకాశం ఉంది.
* సాధ్యమైనంత వరకు పిల్లలను పరుపుల మీద కాకుండా మెత్తటి బట్టలపై పడుకోబెడితే బాగుంటుంది. పక్క బట్టలను ఎప్పటికప్పడు మారుస్తుండాలి. అలాగే ఈ కాలంలో డైపర్స్ కాకుండా మెత్తటి బట్టలనే వాడండి.
* వేసవి కాలంలో పిల్లలు విపరీతంగా ఏడుస్తున్నారంటే వారి శరీరంలో ఉష్ణోగ్రత పెరగటం వల్లనే ఏడుస్తారు. చల్లటిగాలి తగిలేలా చూడాలి. లేదంటే విపరీతమైన ఉక్తపోత, చెమటతో వారు ఏడుస్తుంటారు. ఇటువంటప్పుడు వట్టివేళ్లు వారికి ఎంతో ఉపకరిస్తాయి.
* సోడా తాగే అలవాటు ఉంటే ఫ్రిజ్ వాటర్‌కు బదులు సోడా తాగితే మంచిది. చెమటికాయలు వస్తే ప్రీక్లీహీట్ పౌడర్‌ను ఉపయోగించి వీటి నుంచి రక్షణ పొందవచ్చు.