ఐడియా

ఉసిరి.. ఊపిరిపోసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

25 లక్షలు టర్నోవర్‌వ్యాపారిగా మారిన ఆటో డ్రైవర్

ఆటో డ్రైవర్ ఏమిటి ఏడాదికి 25 లక్షలు టర్నోవర్ సాధించటమేమిటని ఆశ్చర్యపోతున్నారా? నిజమే అమర్‌సింగ్ ఒకప్పుడు ఆటోడ్రైవరే. కాని నేడు ఓ కంపెనీకి ఓనర్. ఎలా అయ్యాడనుకుంటున్నారా? ఉసిరి అతని జీవిత గమ్యానికి ఊపిరి పోసింది. రాజస్థాన్‌లోని సమ్మాన్ అనే మూరుమూల గ్రామానికి చెందిన అమర్‌సింగ్ ఇరవై ఏళ్ల క్రితం ఆటో నడుపుకునేవాడు. చాలీచాలని ఆదాయంతోనే బతుకు బండిని నడిపేవాడు. ఓ రోజు ఉసిరి సాగు గురించి తెలుసుకున్నాడు. ఎన్నాళ్లు ఈ ఆటో నడుపుతాను అని అనుకున్నాడు. స్థానికంగా ఉండే ఓ ఎన్జీఓ సాయం తీసుకుని ఉసిరి సాగు, దీంతో తయారుచేసే వివిధ రకాల ఫుడ్ ఐటెమ్స్ గురించి అధ్యయనం చేశాడు. తరువాత సాహసం చేసి కేవలం పనె్నండు వందల రూపాయల పెట్టుబడితో అరవై ఉసిరి చెట్లు రెండున్నర ఎకరాల పొలంలో నాటాడు. ఇలా అరవై చెట్లతో మొదలైన అతడి ప్రయాణం ఇవాళ లక్షల ఆదాయం వైపు పరుగులు పెడుతుంది. తొలుత అమర్ సెల్ఫ్ గ్రూపుగా ఉన్న వ్యాపారం కాలక్రమంలో అమర్ మెగా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మారింది. మొక్కల పెంపకం నుంచి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రావాణా, అమ్మకందాకా అన్నీ తానే స్వయంగా చూసుకుంటాడు. నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తుండటంతో కస్టమర్లే అమర్‌సింగ్ కంపెనీని వెతుక్కుంటూ వస్తారు.