జాతీయ వార్తలు

జెఎన్‌యులో జాతి వ్యతిరేక వ్యాఖ్యలు నిజమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరి 9న దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)లో జరిగిన అఫ్జల్‌గురు సంస్మరణ సభలో కొందరు విద్యార్థులు జాతి వ్యితిరేక వ్యాఖ్యలు చేసినట్లు కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిర్ధారించింది. ఈ సభకు సంబంధించి నాలుగు వీడీయాలను ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశీలించి ఈ విషయాన్ని కనుగొంది. పార్లమెంటుపై ఉగ్రదాడికి సంబంధించి నేరస్థుడైన అఫ్జల్‌గురును 2013 ఫిబ్రవరి 9 ఉరి తీశారు. అఫ్జల్‌ను ఉరి తీయడం భారతీయ న్యాయవ్యవస్థ చేసిన తప్పు అని సంస్మరణ సభలో కొందరు విద్యార్థులు ప్రసంగించారు. దీంతో జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ సహా మరికొందరిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దిల్లీ హైకోర్టు ఉత్తర్వులతో వీరంతా ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యారు.