అంతర్జాతీయం

భారత పురాతన విగ్రహాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మార్చి 12: భారత్‌లో చోరీకి గురయిన వెయ్యేళ్ల క్రితం నాటి రెండు పురాతన విగ్రహాలను అమెరికాలోని ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీస్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఇసుకరాతితో తయారు చేసిన ఈ విగ్రహాలను వచ్చే వారం వేలం వేయనున్న తరుణంలో స్వాధీనం చేసుకున్నారు. భారత ప్రభుత్వం, ఇంటర్‌పోల్ సహకారంతో 4,50,000 డాలర్లకు పైగా విలువ గల ఈ విగ్రహాలను స్వాధీనం చేసుకోగలిగారు. అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు చెందిన హోమ్‌ల్యాండ్ సెక్యూరిటి ఇనె్వస్టిగేషన్ (హెచ్‌ఎస్‌ఐ) ప్రత్యేక ఏజెంట్లు కలిసి శుక్రవారం ఈ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.