బిజినెస్

మందగమనంలోనే ఐఐపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసగా మూడో నెల కానరాని వృద్ధి * జనవరిలో 1.5 శాతంగా నమోదు

న్యూఢిల్లీ, మార్చి 11: ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనానికి నిదర్శనంగా ఈ జనవరిలోనూ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) గణాంకాలు 1.5 శాతానికి క్షీణించాయి. ఈ మేరకు కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) శుక్రవారం తెలిపింది. పేలవమైన ఉత్పాదక రంగం పనితీరు, క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి పతనం మధ్య వరుసగా మూడో నెలా ఐఐపి కోలుకోలేకపోయింది.
డిసెంబర్‌లో 1.2 శాతంగా ఉంటే, నవంబర్‌లో 3.4 శాతంగా ఉంది. కాగా, గత ఏడాది జనవరిలో ఐఐపి వృద్ధిరేటు 2.8 శాతంగా ఉంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో ఏప్రిల్-జనవరి వరకు ఐఐపి వృద్ధిరేటు గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో ఇదే కాలంతో పోల్చితే యథాతథంగా 2.7 శాతం వద్దే నిలిచింది. ఇదిలావుంటే మొత్తం ఐఐపిలో 75 శాతం వాటా కలిగిన ఉత్పాదక రంగం వృద్ధిరేటు ఈ జనవరిలో 2.8 శాతానికి పరిమితమైంది.
గత ఏడాది జనవరిలో ఇది 3.4 శాతంగా ఉంది. క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి అయితే క్రిందటిసారితో పోల్చితే 12.4 శాతం వృద్ధి నుంచి మైనస్ 20.4 శాతానికి పడిపోయింది. అయితే గనుల రంగం మైనస్ 1.8 శాతం నుంచి 1.2 శాతం వృద్ధికి చేరింది. విద్యుదుత్పత్తి రంగం కూడా 3.3 శాతం నుంచి 6.6 శాతానికి వృద్ధి చెందింది.