రాష్ట్రీయం

జనవరి నుంచి యాదాద్రి పనులు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ
సమీక్షలో దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 17: యాదగిరిగుట్ట అభివృద్ధి పనులు జనవరి నుంచి ఊపందుకుంటాయని దేవాదాయ శాఖ మంత్రి ఎన్ ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు యాదగిరిగుట్ట, వేములవాడ ఆలయాల అభివృద్ధిని వచ్చే మూడేళ్లలో పూర్తిచేసే విధంగా ప్రణాళికలు రూపొందించినట్టు ఆయన చెప్పారు. యాదగిరిగుట్ట, వేముల వాడ ఆలయాల అభివృద్ధిపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సచివాలయంలో గురువారం సమీక్ష జరిపారు. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో టెక్నికల్ కమిటీ పర్యవేక్షణలో అన్ని పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతానికి సాయిల్ టెస్ట్‌లు జరుగుతున్నాయని, అది పూర్తయిన వెంటనే అన్ని పనులకు టెండర్లు ఆహ్వానించనున్నట్టు చెప్పారు. యాదగిరిగుట్ట, వేములవాడ ఆలయాల అభివృద్ధి పనులపై అధికారులతో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్షించారు. ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, యాదగిరిగుట్ట ఆలయ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ కిషన్‌రావు, వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. యాదగిరిగుట్టలో శిల్పకళాశాల ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారని, దానికి తగ్గట్టుగా దేవాదాయ శాఖ అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ త్వరలో ఏర్పాటు కానుందని తెలిపారు. వైటిడిఏ తరహాలోనే దానికి వైస్ చైర్మన్‌ను నియమించనున్నట్టు ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. వేములవాడ ఆలయ రెండవ ప్రాకార నిర్మాణంపై శృంగేరి పీఠాధిపతి సలహాలు తీసుకోనున్నట్టు చెప్పారు. త్వరలోనే ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఆధ్వర్యంలో ఒక బృందం శృంగేరి పీఠానికి వెళ్లనుందని తెలిపారు. వేములవాడ ఆలయ విస్తరణకు భూసేకరణపై దేవాదాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపిందని తెలిపారు. సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వేములవాడ ఆలయ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, వేములవాడ ఎగ్జిక్యూటివ్ అధికారి రాజేశ్వర్‌లు పాల్గొన్నారు.
సమ్మక్క- సారక్క జాతర ఏర్పాట్లు
ఆసియాలో పెద్దదైన గిరిజన జాతర సమ్మక్క- సారక్క జాతరకు చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన స్ఫూర్తితో మేడారం జాతరను బ్రహ్మాండంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. జనవరిలో మేడారం జాతర పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నట్టు ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.