అంతర్జాతీయం

వీసాలకు లాటరీ ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 2: వీసా లాటరీ ప్రాతిపదికగా కాకుండా నైపుణ్యం, సమానత్వం, నిష్పాక్షికత ప్రాతిపదికగా ఇమ్మిగ్రేషన్ విధానాన్ని అమలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు పునరుద్ఘాటించారు. లాటరీ పద్ధతిలో వీసాలు మంజూరు చేయడం అన్నది భయానక విధానమని అభివర్ణించారు. పశ్చిమ వర్జీనియాలో ఓ సమావేశంలో మాట్లాడిన ట్రంప్, అమెరికా ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే విధంగానే వీసా పద్ధతిని అమల్లోకి తెస్తామని చెప్పారు. అమెరికాకు ఉద్యోగాల కోసం వచ్చే వ్యక్తులు నైపుణ్యం ఆధారంగానే ఎంపిక కావాలని, అదేవిధంగా అమెరికాను, అమెరికా ప్రజలను వారు గౌరవించాలని పేర్కొన్న ఆయన, అలాంటి వ్యక్తులకే అమెరికా ఆహ్వానం పలుకుతుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీసా లాటరీని అమలు చేసేది లేదని తెగేసి చెప్పారు. నైపుణ్యం, సామర్థ్యం, ప్రావీణ్యమే ఇమ్మిగ్రేషన్‌కు ప్రాతిపదిక కావాలని రిపబ్లికన్ సభ్యుల హర్షధ్వానాల మధ్య ఆయన వెల్లడించారు. మెరిట్ ఆధారిత ఇమ్మిగ్రేషన్ విధానాన్ని అమలు చేయాలని ట్రంప్ నిశ్చిత నిర్ణయాన్ని ఇప్పటికే వైట్ హౌస్ సమర్థించింది. ఇందుకు భిన్నంగా వలస విధానాన్ని అవలంబించడం వల్ల అమెరికాలో వలసదారుల సంఖ్య పెరిగిపోయిందని, అమెరికా పౌరులకే ఉద్యోగాలు లేని పరిస్థితి తలెత్తిందని వైట్‌హౌస్ తెలిపింది. దశాబ్దాలుగా అమెరికా ప్రజలు ఏరకమైన వలస విధానాన్ని కోరుకుంటున్నారో అందుకు సంబంధించిన బిల్లును ఆమోదించే అవకాశం అమెరికా కాంగ్రెస్‌కు కలిగిందని ట్రంప్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. అధికార రిపబ్లికన్ పార్టీలా ఈ విషయంలో తాము దేశ ప్రజల ప్రయోజనాలను పరిరక్షిస్తామని, అయితే ఈ విషయంలో ప్రతిపక్ష డెమొక్రాట్ల నుంచి మాత్రం పూర్తిస్థాయిలో సహకారం అందటం లేదని తెలిపారు. అయితే డెమొక్రాట్లు కూడా ప్రతిభ ఆధారిత ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని తీసుకొచ్చే విషయంలో మనసు మార్చుకుని సహకరిస్తారన్న నమ్మకం తనకుందన్నారు.