జాతీయ వార్తలు

చట్ట ప్రకారం వ్యవహరిస్తాం:ఇమ్రాన్‌ఖాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కులభూషణ్ జాదవ్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్పందించారు. ఈ కేసులో ఐసీజే తీర్పు తమకు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు. జాదవ్‌ను విడుదల చేయొద్దని.. భారత్‌కు అప్పగించొద్దంటూ తీర్పు ఇవ్వడంపై ఐసీజేకు కృతజ్ఞతలు తెలిపారు. పాక్ ప్రజలకు వ్యతిరేకంగా జాదవ్ నేరాలకు పాల్పడ్డాడన్నారు. కులభూషణ్ కేసులో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం బుధవారం తుది తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. పాక్ సైనిక కోర్టు విధించిన ఉరిశిక్షను నిలుపుదల చేయాలంటూ ఐసీజే ఆదేశించింది. తీర్పును పునఃసమీక్షించాలని తెలిపింది.