బిజినెస్

హైదరాబాద్ ఐఎమ్‌టిలో ‘ఇంపెల్జ్-2015’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: హైదరాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎమ్‌టి)లో శనివారం ‘ఇంపెల్జ్-2015’ అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస హేచరీస్ గ్రూప్ వైస్ చైర్మన్, డైరెక్టర్ సురేశ్ రాయుడు చిట్టూరి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు ఔత్సాహిక పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో ఐఎస్‌బి, కెజెఎస్‌ఐఎమ్‌ఎస్‌ఆర్, క్రిస్ట్ యూనివర్సిటీ, సిమ్స్ పుణె విద్యార్థులు పాల్గొనగా, ఈ ఈవెంట్‌కు న్యాయనిర్ణేతలుగా రా చెమ్ ఫార్మా లిమిటెడ్ మార్కెటింగ్, సేల్స్ అధిపతి శిరీశ్ కుమార్ రావుల, సింగులారిటి స్ట్రాటజిక్ ఎండి బ్రిజేశ్ చంద్వాని వ్యవహరించారు. వీరు విజేతలను ప్రకటించి బహుమతులు అందజేశారు. ఇకపోతే ఈ సందర్భంగా విద్యార్థులు తమ స్టార్టప్ ఐడియాలను అందరితో పంచుకున్నారు. అలాగే ఇక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో ఐఎమ్‌టి డైరెక్టర్ సతీశ్ ఐలవడి, ఫ్యాకల్టీ మెంటర్స్ శబ్నమ్ ప్రియదర్శిని, కె శ్రీహర్ష రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చిత్రం) మాట్లాడుతున్న ఐఎమ్‌టి డైరెక్టర్ సతీశ్ ఐలవడి