రాష్ట్రీయం

రేపు ఐఎంటి స్నాతకోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* టివిఎస్ చైర్మన్ హాజరు
హైదరాబాద్, మార్చి 12: విజ్ఞానం, విలువలు, నైపుణ్యం సమ్మిళితం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ టెక్నాలజీ (ఐఎంటి) అని సంస్థ డైరెక్టర్ సతీశ్ ఐలవాది పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 2011జూలైలో ప్రారంభమైన ఈ సంస్థ రెండేళ్ల అవధి ఉన్న ఫుల్ టైమ్ పిజిడిఎం కోర్సును అందిస్తున్న ప్రతిష్ఠాత్మక సంస్థ అని, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపంలో 30 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. సోమవారం నాడు సంస్థ స్నాతకోత్సవం జరుగనుందని, ఈ కార్యక్రమానికి టివిఎస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ వేణుశ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నింగ్ కౌన్సిల్ అధ్యక్షుడు కమలనాధ్ ప్రసంగిస్తారని, ముఖ్య అతిథి వేణుగోపాల్ ప్రసంగం అనంతరం విద్యార్థులకు పట్టాలు, పతకాలు ప్రదానం చేస్తారని ఆయన చెప్పారు. విద్యార్థిలో సమగ్ర అవగాహన, వాస్తవిక వాణిజ్య జీవన విధానాన్ని పెంచడమేగాక, వాణిజ్యరంగంలో సమస్యలను అధిగమించేలా పాఠ్యప్రణాళికలను రూపొందించినట్టు చెప్పారు. ఐఎంటిల్లో అనుసరించే విద్యావిధానం పూర్తిగా విద్యార్థి దృష్టికోణంలోనే సాగుతుందని, వారిని వాణిజ్యపరమైన అంశాల్లో భాగస్వామ్యులను చేసేదిగా, విశిష్టమైన అనుభవం కలిగించేదిగా బృందనాయకత్వాన్ని పెంచేదిగానూ ఉంటుందని అన్నారు. పురోగమిస్తున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఐఎంటి కృషి చేస్తోందని చెప్పారు. ఈ ఫలితంగానే విద్యార్థులు రెగ్యులర్ కోర్సులోని 30 శాతం కాలాన్ని వివిధ బిజినెస్ సెక్టార్లలో ప్రాక్టీషనర్లుగా కొనసాగుతున్నారని ఆయన వివరించారు.