అంతర్జాతీయం

ట్రంప్ పట్ట్భాషేకానికి సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 18: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి వాషింగ్టన్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది మంది ఆయన అభిమానులు వాషింగ్టన్‌కు చేరుకుంటున్నారు. దీంతో అమెరికా మొత్తం ట్రంప్ మానియాలో తేలియాడుతోంది. ఈ నెల 20న అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం తెలిసిందే. ఆయన రెండు బైబిళ్లతో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ తన ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో ఉపయోగించిన బైబిల్ వాటిలో ఒకటి కాగా, ట్రంప్ చిన్నతనంలో ఆయనకు తల్లి బహూకరించిన బైబిల్ రెండవది. ట్రంప్ సండే చర్చి స్కూల్‌నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా 1955 జూన్ 12న న్యూయార్క్‌లోని ఫస్ట్‌ప్రెస్ బెటిరియన్ చర్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన తల్లి ఈ బైబిల్‌ను ఆయనకు బహూకరించింది.
ట్రంప్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అమెరికన్లను ఎంతగానో అకట్టుకోవడమే కాకుండా ఆయన విజయం సాధించడానికి సైతం ప్రధాన అంశంగా ఉపయోగపడిన నినాదం ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ మెయిన్ థీమ్‌గా ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా చూడడానికి కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో గద్దె దిగిపోతున్న అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం భద్రతా ఏర్పాట్ల సన్నద్ధతను సమీక్షించారు. ‘ట్రంప్‌కు కనీవినీ ఎరుగని మద్దతును మనం చూడబోతున్నాం’ అని త్వరలో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్న స్పీన్ స్పైసర్ మంగళవారం విలేఖరుల సమావేశంలో చెప్పడం గమనార్హం. ఈ చరిత్రాత్మక ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఏదో ఒక విధంగా పాల్గొనడానికి జనం పెద్దఎత్తున ఆసక్తి చూపిస్తుడడం పట్ల ట్రంప్ సంతోషంతో ఉన్నారని ఆయన చెప్పారు. వాషింగ్టన్ డిసిలోని ట్రంప్ మద్దతుదారులు శుక్రవారం జరగబోయే ప్రమాణ స్వీకారానికి ముందే ఇప్పటికే పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఆర్లింగ్టన్ నేషనల్ స్మశాన వాటికలో ట్రంప్, ఉపాధ్యక్షుడిగా ఎన్నికయిన మైక్ పెన్స్‌లు దివంగత నేతల సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించడంతో గురువారం అధికారిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. చరిత్రాత్మక నేషనల్ మాల్ కూడా ఈ వేడుకలకు వేదికగా ఉండబోతోంది. లింకన్ మెమోరియల్ మెట్ల వద్ద దేశం నలుమూలలనుంచి వచ్చిన వందలాది మంది కళాకారులు వేలాది మంది ట్రంప్ అభిమానుల సమక్షంలో సంగీత కచేరి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా టెలివిజన్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ సంగీత కచేరి కార్యక్రమానికి ట్రంప్ కూడా హాజరవుతారని భావిస్తున్నారు.

వాషింగ్టన్‌లో దర్శనమిస్తున్న ట్రంప్, ఒబామా పోస్టర్లు