క్రీడాభూమి

హెచ్‌డబ్ల్యుఎల్ ఫైనల్ .. భారత్‌కు కాంస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, డిసెంబర్ 6: అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న హాకీ వరల్డ్ లీగ్ (హెడ్‌డబ్ల్యుఎల్) ఫైనల్ టోర్నమెంట్‌లో భారత జట్టుకు కాంస్య పతకం లభించింది. క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో పటిష్టమైన నెదర్లాండ్స్‌తో హోరాహోరీగా పోరు సాగింది. గోల్స్ వరద పారింది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు సమవుజ్జీగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యపైంది. అందులో భారత్ 3-2 తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించి కాంస్య పతకాన్ని అందుకుంది. మ్యాచ్ ఆరంభమైన మరుక్షణం నుంచే ఇరు జట్ల ఆటగాళ్లు దూకుడుగా ముందుకు కదిలారు. అయితే, భారత రక్షణ వలయాన్ని ఛేదించిన మిర్కో ప్రజ్‌సెర్ 9వ నిమిషంలోనే తొలి గోల్ చేయగా, 25వ నిమిషంలో వాన్ డెర్ షూట్ నీక్ ద్వారా నెదర్లాండ్స్‌కు రెండో గోల్ లభించింది. సహజంగా ప్రత్యర్థి వరుసగా రెండు గోల్స్ చేసిన వెంటనే తీవ్రమైన ఒత్తిడికిలోనయ్యే భారత జట్టు అందుకు భిన్నంగా ఆడింది. ఎదురుదాడికి దిగింది. 39వ నిమిషంలో రమన్దీప్ సింగ్ భారత్‌కు తొలి గోల్ అందించగా, 47వ నిమిషంరో రూపీందర్‌పాల్ సింగ్ ఈక్వెలైజర్‌ను సాధించిపెట్టాడు. మరో నాలుగు నిమిషాల్లోనే రమన్దీప్ సింగ్ భారత్‌కు 3-2 ఆధిక్యంలో కూర్చోబెట్టాడు. కానీ, ఈ గోల్ నమోదైన మూడు నిమిషాల్లనే వాన్ డెర్ వీర్డెన్ మిన్క్ ద్వారా నెదర్లాండ్స్‌కు ఈక్వెలైజర్ లభించింది. క్షణంలో కోరుకున్న రూపీందర్‌పాల్ సింగ్ మరో నిమిషంలోనే భారత్‌కు గోల్‌ను అందించాడు. ఆ మరుసటి నిమిషమే ఆకాష్‌దీప్ సింగ్ మరో గోల్ చేశాడు. దీనితో భారత్ ఆధిక్యం 5-3కు చేరింది. కాగా, చివరి క్షణాల్లో భారత ఆటగాళ్ల మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిన వీర్డెన్ మిన్క్ 58, 60 నిమిషాల్లో వరుస గోల్స్ సాధించాడు. దీనితో మ్యాచ్ నిర్ణీత సమయం ముగిసే సమయానికి ఇరు జట్లు చెరి ఐదు గోల్స్‌తో సమవుజ్జీగా నిలిచాడు. దీనితో ఫలియాన్ని నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్‌లోనూ తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది. నెదర్లాండ్స్ ఆటగాడు బిల్లీ బాకెర్ మొదటి ప్రయత్నంలో సఫలమయ్యాడు. కానీ, భారత ఆటగాడు దనీష్ ముజ్‌తబా విఫలం కావడంతో నెదర్లాండ్స్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. జెరోన్ హెర్ట్ బెర్గర్ బంతిని గోల్ పోస్టులోకి కొట్టలేకపోవడంతో నెదర్లాండ్స్‌కు ఓ ప్రయత్నం వృథా అయింది. భారత ఆటగాడు అమీర్ ఖాన్ కూడా గోల్ చేయలేకపోయాడు. తర్వాత నెదర్లాండ్స్ తరఫన మిర్కో ప్రజ్‌సెర్ ప్రయత్నం విఫలమైంది. అనంతరం బీరేంద్ర లాక్రా చేసిన గోల్‌తో భారత్ స్కోరును 1-1గా సమం చేయగలిగింది. అనంతరం వాన్ ఆస్ సీవ్ గోల్ చేసి, నెదర్లాండ్స్ ఆధిక్యాన్ని 2-1కి చేర్చగా, తర్వాతి ప్రయత్నంలోనే భారత కెప్టెన్ సర్దార్ సింగ్ గోల్ చేయడంలో సఫలమయ్యాడు. దీనితో స్కోరు తిరిగి సమమైంది. వెర్గా వలెంటైన్ గట్టిగా కొట్టిన బంతిని భారత గోల్‌కీపర్ శ్రీజేష్ లాఘవంగా అందుకోవడంలో నెదర్లాండ్స్‌కు గోల్ లభించలేదు. మన్‌ప్రీత్ సింగ్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగా, భారత్ 3-2 తేడాతో విజయభేరి మోగించి, కాంస్య పతకం సాధించింది. (చిత్రం) భారత్, నెదర్లాండ్స్ జట్ల మధ్య శనివారం జరిగిన క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో ఓ దృశ్యం

ఆనందంగా ఉంది: సర్దార్
రాయ్‌పూర్: హెచ్‌డబ్ల్యుఎల్ ఫైనల్ టోర్నమెం ట్‌లో కాంస్య పతకం లభించినందుకు ఎంతో ఆ నందంగా ఉందని భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దా ర్ సింగ్ అన్నాడు. మూడో స్థానానికి జరిగిన క్లాసి ఫికేషన్ మ్యాచ్ ముగిసిన తర్వాత అతను విలేఖ రులతో మాట్లాడుతూ నెదర్లాండ్స్‌కు చివరి వర కూ గట్టిపోటీనిచ్చామని అన్నాడు. వచ్చే ఏడాది రి యోలో జరిగే ఒలింపిక్స్ సిద్ధమవుతున్న తమకు ఈ విజయం ఆత్మవిశ్వాసాన్ని అందిస్తున్నదని అన్నాడు. మరింత పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తామని సర్దార్ చెప్పాడు.