అంతర్జాతీయం

మా ప్రతిపాదనలకు చోటు దక్కలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాతావరణ మార్పుల ఒప్పందం ముసాయిదాపై భారత్ అసంతృప్తి
పారిస్, డిసెంబర్ 10: వాతావరణ మార్పులను అదుపులో ఉంచడానికి కుదుర్చుకోనున్న ఒప్పందం ముసాయిదాలో తాను ప్రతిపాదించిన అనేక అంశాలకు చోటు దక్కలేదని భారత్ గురువారం ఆవేదన వ్యక్తం చేసింది. తుదకు కుదిరే ఒప్పందానికి ఈ ముసాయిదాయే కీలకం. పారిస్‌లో కొనసాగుతున్న వాతావరణ మార్పుల శిఖరాగ్ర సదస్సు శుక్రవారం ముగుస్తుండటంతో చర్చలలో పాల్గొంటున్న వివిధ దేశాల ప్రతినిధులు ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి కాలంతో పాటు పరుగులు తీస్తున్నారు. పారిశ్రామిక విప్లవానికి ముందున్న 1.5 డిగ్రీల సెల్సియస్ భూతాపం స్థాయికి ప్రస్తుతం ఉన్న హెచ్చు భూతాపాన్ని తగ్గించడానికి అభివృద్ధి చెందిన దేశాలు తమ కర్బన ఉద్గారాలను పెద్ద మొత్తంలో తగ్గించుకోవడంతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారీగా ఆర్థిక సహాయం చేయాల్సి ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్‌మైన్డ్ కంట్రిబ్యూషన్స్ (ఐఎన్‌డిసిలు) అనే భావన ఎంతో సృజనాత్మకమైనదని పేర్కొంటూ ముసాయిదాలో వీటిని కనీసం ప్రస్తావించకపోవడం విచారకరమని భారత పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఉన్నత స్థాయి మంత్రుల స్థాయి చర్చల అనంతరం రూపొందించిన ముసాయిదాను బుధవారం ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లౌరెంట్ ఫాబియస్ బుధవారం సదస్సులో విడుదల చేశారు. 43 పుటల నుంచి 29 పుటలకు తగ్గిన ఈ ముసాయిదా పత్రాన్ని చర్చలలో పాల్గొంటున్న అన్ని దేశాలకు అందజేశారు.