బిజినెస్

ద్రవ్యోల్బణం గణాంకాలు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలూ ముఖ్యమే
ఈ వారం మార్కెట్ సరళిపై నిపుణుల అంచనా

న్యూఢిల్లీ, మార్చి 13: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం, ముందస్తు పన్ను వసూళ్ల వివరాలు మదుపరుల పెట్టుబడులను ప్రభావితం చేస్తాయని పేర్కొంటున్నారు. ఫిబ్రవరి నెలకుగాను వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు సోమవారం విడుదలవుతున్నాయని, దీంతో మదుపరులు తమ పెట్టుబడులపై వీటి ఆధారంగా నిర్ణయం తీసుకునే వీలుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. క్యాపిటల్‌వయా గ్లోబల్ రిసెర్చ్ లిమిటెడ్ వ్యవస్థాపక సిఇఒ రోహిత్ గడియా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే గత శుక్రవారం మార్కెట్ ట్రేడింగ్ ముగిశాక జనవరి నెలకుగాను విడుదలైన పారిశ్రామికోత్పత్తి (ఐఐపి) గణాంకాలు మైనస్ 1.5 శాతానికి పడిపోవడంపైనా సోమవారం మదుపరులు స్పందిస్తారని చెబుతున్నారు. మరోవైపు 15,16 తేదీల్లో అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడ్ రిజర్వ్ చేపట్టే ద్రవ్యసమీక్ష ప్రభావం కూడా సూచీలపై ఉండనుంది. అంతేగాక డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరల కదలికలు కూడా ఈ వారం మార్కెట్లను శాసిస్తాయని విశే్లషకులు అంటున్నారు. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 72 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 25 పాయింట్లు స్వల్పంగా పెరిగినది తెలిసిందే.