బిజినెస్

భారత వౌలికాభివృద్ధికి సహకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరింత రుణసాయం చేస్తాం: ఎడిబి అధ్యక్షుడు తకెహికో నకావు

న్యూఢిల్లీ, మార్చి 11: భారత వౌలికరంగాభివృద్ధికి బాసటగా నిలుస్తామని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఎడిబి) హామీ ఇచ్చింది. రాబోయే మూడేళ్లలో 10-12 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందిస్తామని స్పష్టం చేసింది. ఎడిబి అధ్యక్షుడు తకెహికో నకావు శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని ఇక్కడ కలిశారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల మధ్య, కమాడిటీ, ఫైనాన్షియల్ మార్కెట్ల ఒడిదుడుకుల నడుమ భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతిపథంలో వెళ్తోందని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. ఈ మేరకు ఎడిబి ఓ ప్రకటనలో తెలిపింది. ఇకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో భారత జిడిపి వృద్ధిరేటు 7 శాతాన్ని మించి నమోదవుతుందన్న విశ్వాసాన్ని నకావు వ్యక్తం చేశారు. ఆపై ఆర్థిక సంవత్సరం (2017-18)లోనూ జిడిపి 7 శాతంపైనే ఉంటుందని అంచనా వేశారు. గత ఏడాది భారత్‌కు దాదాపు 3 బిలియన్ డాలర్ల రుణాలను ఎడిబి ఇచ్చింది. (చిత్రం) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమైన ఎడిబి అధ్యక్షుడు తకెహికో నకావు