రాష్ట్రీయం

వౌలిక సదుపాయాలు కల్పిస్తేనే వస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎపిఎన్‌జిఓ అధ్యక్షుడు ఆశోక్‌బాబు
గుంటూరు, డిసెంబర్ 12: రాజధాని ప్రాంతంలో కార్యాలయాలతోపాటు వౌలిక సదుపాయాలు కల్పిస్తే హైదరాబాద్ నుంచి ఉద్యోగలంతా తరలివస్తారని ఎపిఎన్‌జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆశోక్‌బాబు తెలిపారు. శనివారం గుంటూరు ఎన్‌జిఓల సంఘ భవనంలో కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆశోక్‌బాబు మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వంతో హెల్త్‌కార్డుల విషయంపై పలుమార్లు చర్చించినప్పటికీ సరిగా స్పందించలేదన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించక పోవటంతో తీవ్ర అసంతృప్తిగా ఉందన్నారు. ఇదే వైఖరి ప్రభుత్వం అవలంబిస్తే సమస్యల పరిష్కరానికి ఉద్యమబాట తప్పదన్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనైనా ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించటంతోపాటు ఒప్పంద ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు 10 నుంచి 12 లక్షల రూపాయల వరకు గ్రాట్యుటీ చెల్లిస్తోందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని చెల్లించాలని, లేనిపక్షంలో తెలంగాణలో పని చేస్తున్న ఎపి ఉద్యోగులు వారు ఎక్కడ కోరుకుంటే అక్కడ పని చేసే వెసులుబాటు కల్పించాలని కోరారు. శ్రీకాకుళంలో ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో ఎన్‌జిఓ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు పలువురు పాల్గొన్నారు.