జాతీయ వార్తలు

కేంద్ర మంత్రి నడ్డాపై మెడికోల ఇంకు దాడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్: భోపాల్‌లోని ఎయిమ్స్ (అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ)ను సందర్శించడానికి శనివారం మధ్యాహ్నం వచ్చిన కేంద్ర ఆరోగ్యమంత్రి జెపి నడ్డాకు చేదు అనుభవం ఎదురైంది. భోపాల్‌లో ఎయిమ్స్ ప్రారంభించి 13 ఏళ్లు గడిచినా తమకు సరైన సౌకర్యాలు లేవని విద్యార్థులు నినాదాలు చేస్తూ మంత్రి కారును అడ్డగించారు. విద్యార్థులను నిలువరించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కింద పడిపోయిన ఇద్దరు విద్యార్థులకు గాయాలు తగిలాయి. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మెడికోలు మంత్రి చొక్కాపై సిరా చల్లారు. వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని మంత్రిని అక్కడి నుంచి క్షేమంగా తీసుకుపోయారు. సరైన సౌకర్యాలు కల్పించాలని, బోధనా సిబ్బందిని నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.