అంతర్జాతీయం

ఉద్రిక్తతలు తగ్గించుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్తాంబుల్, నవంబర్ 25: సిరియా సరిహద్దుల్లో రష్యా యుద్ధ విమానాన్ని కూల్చివేసిన ఘటన తరువాత తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యపీ ఇర్గోగాన్ స్పష్టం చేశారు. ఈ ఘటనతో రష్యా, టర్కీల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి. టర్కీ తమకు వెన్నుపోటు పొడిచిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రష్యన్లు ఎవరూ టర్కీ విహారయాత్రలకు వెళ్లొద్దని ఆయన ఆదేశించారు. కాగా నిత్యం గొడవలతో రగులుతున్న ఈ ప్రాంతంలో సరిహద్దు భద్రత, ప్రజల భద్రత తమకు ముఖ్యమని టర్కీ వాదిస్తోంది. గగనతలాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత టర్కీకి ఉందని అమెరికా పేర్కొంది. రష్యా యుద్ధ విమానం ఐదు నిముషాల్లో పదిసార్లు తమ గగనతలంపై నుంచి వెళ్లిందని టర్కీ వెల్లడించింది. కాబట్టి తాము ఉద్దేశపూర్వకంగా రష్యా యుద్ద విమానాన్ని కూల్చలేదని అధ్యక్షుడు వివరించారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు ఒబామా స్పందించారు. గగనతలాన్ని రక్షించుకోవల్సిన బాధ్యత టర్కీకి ఉందన్న ఒబామా రష్యా, టర్కీలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. కాగా ఒబామా వ్యాఖ్యలతో టర్కీ ఏకీభవించింది.

ఉద్రిక్తతలు సడలించడానికి తాము సిద్ధమని ప్రకటించింది. ఇలా ఉండగా ఐరాసలోని టర్కీ రాయబారి హాలిట్ చెవిక్ భద్రతా మండలికి ఓ లేఖ రాస్తూ రెండు విమానాలు తమ గగనతలంలోకి వచ్చాయని వెల్లడించారు. ఒకదాన్ని కూల్చివేయగా మరొకటి తప్పించుకుపోయిందని వివరించారు.