అంతర్జాతీయం

అఫ్గాన్‌పై తాలిబన్ల పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, ఏప్రిల్ 19: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. దేశ రాజధాని కాబూల్ నడిబొడ్డున ట్రక్కు బాంబుతో మంగళవారం భీకర దాడికి తెగబడి నరమేథాన్ని సృష్టించారు. ఈ దాడిలో దాదాపు 28 మంది ప్రజలు మృతిచెందగా, వందలాది మంది గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య భీకర పోరాటం మొదలైంది. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు ఈ ఏడాది మళ్లీ దాడులను ప్రారంభించిన వారం రోజులకే ఈ ఘటన జరిగింది. ఈ దాడికి పాల్పడింది తామేనని తాలిబన్లు ప్రకటించుకున్నారు. సెంట్రల్ కాబూల్‌లో రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమీపాన జరిగిన ఈ భీకర దాడి ధాటికి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్ల కిటికీల అద్దాలు పగిలి పోవడంతో పాటు ఆ ప్రాం తంలో దట్టమైన పొగ మేఘాలు అలుముకున్నాయి. తాలిబన్ ఆత్మాహుతి దళ సభ్యుల్లో ఒకడు ప్రభుత్వ కార్యాలయానికి పక్కన పార్కింగ్ ప్రదేశంలో పేలుడు పదార్ధాలతో నింపిన ట్రక్కును పేల్చివేసి ఈ దాడికి పాల్పడ్డాడని కాబూల్ పోలీసు ప్రధానాధికారి అబ్దుల్ రహ్మాన్ రహీమి విలేఖర్లకు తెలిపారు. ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో ఎక్కువ మంది సాధారణ పౌరులే ఉన్నారని ఆయన చెప్పారు. ఈ దాడి అనంతరం మరో ఉగ్రవాది కొద్దిసేపు భద్రతా దళాలతో పోరాడానని, అయితే ఎదురు కాల్పుల్లో ఆ ఉగ్రవాది హతమయ్యాడని ఆయన వివరించారు. ఈ దాడిలో 183 మంది గాయపడ్డారని రహీమి తెలుపగా, క్షతగాత్రుల సంఖ్య దాదాపు 330 వరకు ఉందని, వీరిలో చాలా మంది ఆసుపత్రిలో చావు, బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని అఫ్గాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ దాడి అనంతరం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య అనేక గంటల పాటు భీకర పోరాటం సాగిం ది. అయితే ఆ తర్వాత కాల్పులు సద్దుమణిగినట్టు కనిపిస్తున్నప్పటికీ ఆ ప్రాంతంలో మరికొంత మంది బాం బర్లు ఉండవచ్చని అధికారులు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ దాడిని ‘యుద్ధ నేరం’గా పరిగణిస్తున్నామని, ముష్కరులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని అఫ్గానిస్తాన్ హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇదిలావుంటే, అఫ్గానిస్తాన్ ప్రధాన గూఢచార సంస్థ ఎన్‌డిఎస్ (నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ) కార్యాలయాల్లోకి చొచ్చుకెళ్లి దాడి జరపడంలో తమ సభ్యులు విజయవంతమయ్యారని తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ ప్రకటించాడు. అయితే దీనిని అఫ్గాన్ అధికారులు తోసిపుచ్చారు. ప్రభుత్వ విఐపిలకు భద్రత కల్పించే సిబ్బంది కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు.

అఫ్గాన్‌లో మంగళవారం తాలిబన్ మిలిటెంట్ల
ఆత్మాహుతి దాడిలో ధ్వంసమైన కాబూల్ ప్రాంతం