అంతర్జాతీయం

బిగ్‌బెన్ మూగబోతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఏప్రిల్ 26: బ్రిటన్‌లో ప్రసిద్ధ కట్టడాల్లో ఒకటైన బిగ్‌బెన్(క్లాక్‌టవర్) మూగబోతోంది. 315 అడుగుల ఎతె్తైన ఈ క్లాక్ టవర్‌ను 1856లో పూర్తిచేశారు. 2009 నాటికే నూట ఏభై ఏళ్లు పూర్తిచేసుకున్న బిగ్‌బెన్‌ను అధికారికంగా ఎలిజబెత్ టవర్‌గా నామకరణ చేశారు. 2012లో ఎలిజబెత్-2 డైమండ్ జూబ్లీ సందర్భంగా అధికారికంగా ఎలిజబెత్ టవర్‌గా పిలుస్తున్నారు.నాలుగు ముఖాలున్న క్లాక్ టవర్ గల బిగ్‌బెన్ ప్రంపచంలోనే ఎత్తయిన క్లాక్ టవర్లలో రెండోది. క్లాక్ టవర్ కప్పు తప్పుపట్టడం, బీటలు తీయడంతో మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. 29 మిలియన్ ఫౌండ్లతో మరమ్మతులు చేపట్టనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. 2017 మొదలెట్టి మూడేళ్లలో రిపేర్లు పూర్తిచేస్తారు. ఈ మూడేళ్లు క్లాక్‌టవర్ నుంచి గంటల మోత వినిపించదని హౌస్ ఆఫ్ కామన్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు.