అంతర్జాతీయం

అంతా ఇచ్చేస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాన్ ఫ్రాన్సిస్కో, డిసెంబర్ 2:దాతృత్వంలో ఓ సంచలనం. కేవలం ఒక్క శాతం మాత్రమే ఉంచుకుని 99శాతం వాటాను దాతృత్వ సంస్థకు ఇచ్చేస్తానని ఫేస్‌బుక్ సిఇఓ మార్క్ జుకెర్‌బెర్గ్ ప్రకటించారు. ఈ ఆస్తుల మొత్తం విలువ 45బిలియన్ డాలర్లు! తన కుమార్తె మాక్సిమాకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చిన్నారుల సంక్షేమం కోసమే తానీ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. గత వారమే జుకెర్‌బెర్గ్ భార్య ప్రిస్సిలా చాన్ ఆడపిల్లను ప్రసవించినా ఆ విషయాన్ని ఆయన బుధవారం ప్రకటించాడు. ‘ప్రపంచ వ్యాప్తంగా పిల్లలందరి కోసం, వారి సంక్షేమం కోసం, భవిష్యత్ తరాల కోసం ఈ చిన్న మొత్తాన్ని ఇస్తున్నామని భార్యాభర్తలిద్దరూ వెల్లడించారు. ‘మా బిడ్డ పెరుగబోయే ప్రపంచంలో చిన్నారులకు ఏ లోటూ ఉండకూడదు. అందుకు మన తరం ఇతోధికంగా తోడ్పడాలి. పేదరికాన్ని తొలగించాలి. దేశాల మధ్య అవగాహన పెంచాలి. సమాన హక్కులు కల్పించాలి. మా వంతుగా ఫేస్‌బుక్‌లోని 99శాతం వాటాను దానం చేస్తున్నాం. మంచి భవిత కోసం పాటు పడేవారితో మేమూ ముందుకు సాగుతున్నాం’అని తెలిపారు. తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని పిల్లల భవిత పట్ల తమ నైతిక బాధ్యతగా జుకెర్‌బెర్గ్ పేర్కొన్నారు. ‘చాన్ జుకెర్‌బెర్గ్’ పేరుతో ఏర్పాటయ్యే సంస్థకు ఈ మొత్తాన్ని విరాళంగా ఇస్తామని, దాని ద్వారా పిల్లల భవిష్యత్ కోసం, భావి తరాల కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

చిత్రం... బిడ్డపుట్టిన ఆనందంలో జుకర్ దంపతులు