అంతర్జాతీయం

నేతాజీ మృతి చెందారని నిర్ధారించిన యుపిఎ సర్కారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 18: భారత స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాశ్ చంద్రబోస్ అదృశ్యంపై జస్టిస్ మనోజ్ ముఖర్జీ నేతృత్వంలోని విచారణ సంఘం ఇచ్చిన నివేదికలోని అంశాలు వాస్తవం కాదని 2006లో అప్పటి యుపిఎ ప్రభుత్వం తోసిపుచ్చిందని బ్రిటన్‌కు చెందిన ఒక వెబ్‌సైట్ బుధవారం వెల్లడించింది. 1945 ఆగస్టు 18న తైపేయిలో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ సుభాశ్ చంద్రబోస్ చనిపోయి ఉండకపోవచ్చని ముఖర్జీ కమిషన్ పేర్కొన్నది వాస్తవం కాదని యుపిఎ ప్రభుత్వం తిరస్కరించినట్లు ప్రభుత్వ అంతర్గత రహస్య లేఖ ధ్రువీకరించిందని బోస్‌ఫైల్స్.ఇన్‌ఫో వెల్లడించింది. జస్టిస్ ముఖర్జీ కమిషన్ నివేదికపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమర్పించిన చర్యల నివేదిక (యాక్షన్ టేకెన్ రిపోర్ట్)ను మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వ కేబినెట్ 2006 మే 9న జరిగిన సమావేశంలో ఆమోదించిందని బ్రిటన్ వెబ్‌సైట్ వివరించింది. ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అప్పటి కేబినెట్ సెక్రెటేరియట్‌లోని అదనపు కార్యదర్శి విజయ్ శర్మ 2006 మే 11న అప్పటి హోంశాఖ కార్యదర్శి వికె దుగ్గల్‌కు రాసిన లేఖలో తెలియజేశారని వెబ్‌సైట్ తెలిపింది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016 మార్చిలో బహిర్గతం చేసిన రహస్య పత్రాలలో ఈ లేఖ ఉందని వివరించింది. ఈ లేఖ ప్రస్తుతం నేషనల్ ఆర్చైవ్‌లో ప్రజలకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా విమాన ప్రమాదంలో నేతాజీ మృతి చెందలేదని, టోక్యోలోని రెంకోజీ దేవాలయంలో ఉన్న అస్థికలు నేతాజీవి కావని ముఖర్జీ కమిషన్ పేర్కొన్న అంశాలు వాస్తవం కాదని యుపిఎ ప్రభుత్వం తోసిపుచ్చిందని బ్రిటన్ వెబ్‌సైట్ వివరించింది.