అంతర్జాతీయం
తాలిబన్ నేత మన్సూర్ హతం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 23 May 2016
వాషింగ్టన్/ కాబూల్, మే 22: ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ నాయకుడు ముల్లా అఖ్తర్ మన్సూర్‌ను పాకిస్తాన్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో అమెరికా డ్రోన్ హతమార్చింది. మన్సూర్‌తోపాటు మరో మిలిటెంట్‌ను లక్ష్యం చేసుకుని మానవ రహిత డ్రోన్‌ల ద్వారా శనివారం అంతం చేసినట్లు ఆఫ్ఘనిస్తాన్ నిఘా సంస్థ ఒకటి ఆదివారం ప్రకటించింది. శాంతి చర్చలకు పెద్ద అడ్డంకిగా మారిన తాలిబన్ నేత మృతి చెందటం మంచి పరిణామమని అమెరికా ప్రకటించింది. కొద్ది రోజులుగా మన్సూర్ కదలికలను చాలా దగ్గరిగా గమన్తిస్తున్నామని, బలూచిస్తాన్ లో కొందరు తాలిబన్లతో వెళ్తుండగా మానవ రహిత డ్రోన్‌ల ద్వారా బాంబు దాడులు జరిపి టార్గెట్‌ను పూర్తి చేశామని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ అన్నారు.