అంతర్జాతీయం

అమెరికాను దివాలా తీయిస్తాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 24: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైతే తన రియల్ ఎస్టేట్ కంపెనీల్లాగానే దేశాన్ని కూడా దివాలా తీయిస్తాడని ఆయన ప్రత్యర్థి డెమొక్రాట్ల తరపున అభ్యర్థిగా ఎంపికయ్యేందుకు దూసుకుపోతున్న హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యానించారు. రిపబ్లికన్ నామినీ అయిన ట్రంప్ ఆర్థిక విధానం తక్కువ వేతనాలు.. తక్కువ ఉద్యోగాలు, ఎక్కువ అప్పులు కలిసిన ఓ వంటకం అని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘ఎవరైనా కాసినోలో ఎందుకు ఓడిపోతారు.. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను ప్రతిరోజూ వింటున్నాను.. అమెరికాలో నివసిస్తున్న లక్షలాది ఇమ్మిగ్రెంట్లు.. వారి కుటుంబాలు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైతే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు’’ అని ఆమె అన్నరు. డెట్రాయిట్‌లో సోమవారం జరిగిన సర్వీసు ఉద్యోగుల సంఘం అంతర్జాతీయ సదస్సులో క్లింటన్ ప్రసంగించారు. తాను అధికారంలోకి వస్తే వంద రోజుల్లోగా ఒక సమగ్రమైన ఇమ్మిగ్రేషన్ విధానాన్ని తీసుకువస్తానని.. కుటుంబాలను ఒకటిగా ఉంచేందుకు అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకువచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బాటలో ఈ విధానాన్ని పటిష్టంగా రూపొందిస్తానని హిల్లరీ వివరించారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే కోటీ పదిలక్షల మంది ఇమ్మిగ్రెంట్లను వెనక్కి పంపిస్తారని ఆమె చెప్పారు. ‘కష్టపడి పనిచేసే అమెరికన్ కుటుంబాలతోపాటు.. కష్టపడి పనిచేసే వలస కుటుంబాల సంక్షేమంకోసం కూడా మనం నిలబడాలి’’ అని ఆమె అన్నారు.

తల్లులు, తండ్రులు.. వారి పిల్లల భవిష్యత్తుకోసం ఆలోచించాలి’’ అని హిల్లరీ అన్నారు.