అంతర్జాతీయం

అమ్మకానికి అమెరికా పట్టణం!... రేటు 8 మిలియన్ డాలర్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఎంజెలెస్, మే 29: అమెరికాలో ఓ పట్టణం కారు చౌకగా అమ్మకానికి వచ్చింది. కేవలం 8 మిలియన్ డాలర్లు చెల్లిస్తే ఈ పట్టణాన్ని సొంతం చేసుకోవచ్చు! ఓ పది యూనిట్ల హోటల్, కమ్యూనిటీ సెంటర్, కాసినో, జనరల్ స్టోర్, ఓ అగ్ని మాపక కేంద్రంతో 375 మంది ప్రజలతో ఈ పట్టణాన్ని 520 ఎకరాల్లో నిర్మించారు. లాస్ వేగాస్‌కు దక్షిణంగా 130 కిలోమీటర్ల దూరంలో కాల్ నెవ్ అరీ అనే ఈ పట్టణం ఉంది. కాలిఫోర్నియా, నెవాడ, అరిజోనాల మధ్య ఉండటం వల్ల వాటి మొదటి అక్షరాలతో దీనికి నాన్సీ కిడ్‌వెల్ దంపతులు నామకరణం చేశారు. ఓ పట్టణానికి ఎన్ని హంగులున్నాయో అన్ని హంగులూ ఉన్న ఈ పట్టణాన్ని కేవలం 8 మిలియన్ డాలర్లకే అమ్మేస్తున్నారని సిబిఎస్ న్యూస్ తెలిపింది. 1960 దశకంలో కిడ్‌వెల్ దంపతులకు 640 ఎకరాల స్థలాన్ని అప్పటి ఫెడరల్ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంతో చిద్రమైన ఓ ఎయిర్ స్ట్రిప్ కూడా వీరి సొంతమైంది. ఈ నిస్సారమైన భూమి కిడ్‌వెల్ దంపతుల కృషి ఫలితంగా ఓ సుందర పట్టణంగా రూపొందింది. ఇక్కడ ఉంటున్న వారికి అన్ని రకాల సౌకర్యాలను కిడ్‌వెల్ కల్పిస్తున్నారు. గత 51 సంవత్సరాల్లో ఇక్కడే ఆమె మాటే వేదంగా సాగింది. ప్రతి రోజూ వాటర్ ట్యాంక్‌ను పరిశీలిస్తానని, ఎవరికీ నీటి కొరత లేకుండా చేస్తానని ఆమె తెలిపారు. అలాగే కాసినోలకూ వెళతాననీ వెల్లడించారు. మిగతావారి పట్ల తనకు నమ్మకం లేకపోవడం వల్ల ఇక్కడి ప్రజల అవసరాలను తీర్చేందుకు అన్నీ తానే అయి చూసుకుంటానని చెప్పారు. ఇప్పుడు తనకు ఎవరూ లేరని.. 78సంవత్సరాలు వచ్చేయడంతో అన్ని పనులూ తానే చేయలేక పోతున్నానని కిడ్ వెల్ తెలిపారు. పెరిగే వయసే తప్ప తరిగే వయసు కాదు కాబట్టే ఈ పట్టణాన్ని అమ్మేస్తున్నానన్నారు. అలాగే తన లాగ ఈ పట్టణాన్ని కాపాడుకుండూ, ఇక్కడి ప్రజల అవసరాలు తేర్చేందుకు ఎవరూ లేకపోవడం కూడా దీన్ని అమ్మేయాలన్న నిర్ణయానికి కారణమన్నారు. ఇప్పటివరకూ ఈ పట్టణాన్ని కొనేందుకు ముగ్గురు మాత్రమే ఆసక్తి కనబరిచారు.