అంతర్జాతీయం

గడువు దాటితే కునుకే ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, మే 30:నల్లధన పంకిలాన్ని వదిలించుకోక పోతే తీవ్ర ఇబ్బందులకు గురవుతారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నల్ల కుబేరులను హెచ్చరించారు. తమ నల్లధన ఖాతాలను వెల్లడించేందుకు కేంద్రం తాజాగా అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బుధవారం నుంచి మొదలయ్యే ఈ గడువు దాటితే నల్లధన ఖాతాదారులకు ఎదురయ్యేవి నిద్ర లేని రాత్రులేనని కూడా స్పష్టం చేశారు. నల్లధన ఖాతాల వెల్లడికి ఇప్పటి వరకూ కేంద్రం మూడు అవకాశాలు ఇచ్చింది. జూన్ ఒకటి నుంచి స్వల్ప కాల వ్యవధితో కూడిన నాలుగో అవకాశాన్నీ అందిస్తోంది. తమ అక్రమార్జనలో పన్నులు, పెనాల్టీ కలిపి మొత్తం 45 శాతం మొత్తాన్ని ప్రభుత్వానికి కట్టాలని దేశీయ అక్రమార్కులకు ఈ అవకాశం ఉపయోగపడుతుంది. దీన్ని జారవిడుచుకుంటే.. తనంతరం వెల్లడయ్యే వివరాలు ఇలాంటి వారిని తీవ్ర స్థాయిలోనే ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుందని జైట్లీ స్పష్టం చేశారు.