అంతర్జాతీయం

హవాలా, ఉగ్రవాద నిధులపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోహా, జూన్ 5: హవాలా లావాదేవీలు, ఉగ్రవాద నిధులను అదుపు చేయడానికి ఇంటెలిజన్స్ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని భారత్, ఖతార్‌లు ఆదివారం అంగీకరించాయి. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, దానికి మద్దతు ఇచ్చే శక్తులను ఏకాకులను చేయాల్సిన అవసరం ఉందని ఇరుపక్షాలు పేర్కొంటూ, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే, దాన్ని తమ విధానాకి ఒక పావుగా ఉపయోగించుకునే శక్తులపై తక్షణం చర్యలు తీసుకోవడానికి కూడా అంగీకరించాయి. ఖతార్‌లో రెండు రోజుల పర్యటనకోసం వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఖతారు రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-తని, ఖతార్ నాయకులతో జరిపిన చర్చల అనంతరం ఇరు దేశాలకు సంబంధించిన అంశాలతో పాటుగా పరస్పరం ఆసక్తి కలిగిన ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలన్నిటినీ ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా సమీక్షించడం కోసం వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన ఉన్నత స్థాయి సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. ‘ఈ రోజు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అవి భారత్-ఖతార్ సంబంధాలకు కొత్త బలా న్ని చేకూరుస్తాయి’ అని మోదీ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను ఎలా విస్తృతపర్చుకోవాలనే దానిపై తాను, షేక్ తమీమ్ విస్తృతస్థాయిలో చర్చలు జరిపినట్లు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా హవాలాగా పిలవబడే నగదు అక్రమ బదిలీపై ఇంటెలిజన్స్ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ఫైనాన్స్ ఇంటెలిజన్ విభాగం-్భరత్, ఖతార్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ విభాగం మధ్య ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది. నగదు అక్రమ బదిలీపై చర్యలు తీసుకోవడానికి కూడా ఇరుపక్షాలు అంగీకరించినట్లు చర్చల అనంతరం విడుదలయిన ఓ సంయుక్త ప్రకటన పేర్కొంది. రెండు దేశాలకు, తమ ప్రాంతానికి ఉగ్రవాదంనుంచి ముప్పు ఉందన్న విషయాన్ని ఖతార్ కూడా అర్థం చేసుకుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అమర్ సిన్హా చర్చల వివరాలను విలేఖరులకు వివరిస్తూ చెప్పారు. వాణిజ్య సంబంధాలనుంచి వ్యూహాత్మక పెట్టుబడులలోకి మళ్లాల్సిన సమయం వచ్చిందని ఇరుపక్షాలు అభిప్రాయ పడినట్లు ఆయన చెప్పారు.