అంతర్జాతీయం

అవును.. నిజమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 7: నిన్న మొన్నటి వరకూ పాకిస్తాన్‌ను వెనకేసుకొచ్చిన చైనా ఒక్కసారిగా దిగ్భ్రాంతికర వాస్తవాన్ని వెల్లడించింది. 2008లో ముంబయి ఉగ్రవాద దాడి వెనుక పాక్ పాత్ర, అలాగే లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నాయంటూ మొట్టమొదటిసారిగా ధ్రువీకరించింది. భారత ఆర్థిక రాజధాని ముంబయిపై 2008 నవంబర్‌లో పదిమంది లష్కరే ఉగ్రవాదులు దాడి జరిపి మారణకాండ సృష్టించడం, 166మంది ప్రాణాలు బలికొనడం తెలిసిందే. ముంబయి ఉగ్రవాద మారణకాండపై కొద్దిరోజుల క్రితమే ఓ డాక్యుమెంటరీని చైనా అధికారిక చానెల్ సిసిటివి9 ప్రసారం చేసింది. ముంబయిపై దాడి పరోక్షంగా పాక్, ప్రత్యక్షంగా లష్కరే ఉగ్రవాదుల పనేనంటూ డాక్యుమెంటరీలో ప్రస్తావించినట్టు ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది. ఉగ్రవాద సంస్థలపై భద్రతా మండలి నిషేధానికి సంబంధించి సాంకేతిక కారణాలతో పెండింగ్‌లో పడిన బీజింగ్ నిర్ణయం మరో రెండు రోజుల్లో ముగుస్తుందనగా డాక్యుమెంటరీ ప్రసారం కావడం గమనార్హం. లష్కరే, జమాద్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థకు చెందిన హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కి, తల్హా సరుూద్, హఫీజ్ అబ్దుల్ రౌఫ్‌పై నిషేధం విధించకుండా చైనా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో ముఖ్య దేశాలన్నీ ఉగ్రవాద సంస్థల నిషేధానికి అనుకూలంగా వ్యవహరించినపుడు, పాక్‌ను వెనకేసుకొచ్చే చైనా తన వీటో అధికారంతో నిర్ణయం కాకుండా అడ్డుకుంది. అనంతర పరిణామాల్లో జైష్-ఈ-మహ్మద్ చీఫ్ వౌలానా మసూద్ అజర్‌పై నిషేధం విధించాలంటూ భద్రతా మండలి వద్ద భారత్ చేసిన ప్రయత్నాలనూ అడ్డుకుంటూ వచ్చింది. చైనా చర్యను భారత్‌తోపాటు అనేక దేశాలు వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే.