అంతర్జాతీయం

ఇవిగో.. కళాఖండాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 7: భారత్‌లో చోరీకి గురయిన దాదాపు పది కోట్ల డాలర్ల విలువైన 200 ప్రాచీన కళాఖండాలను అమెరికా మంగళవారం భారత్‌కు తిరిగి ఇచ్చేసింది. వీటిలో కొన్ని 2వేల సంవత్సరాల నాటివి కూడా ఉన్నాయి. కాగా, ఈ కళాఖండాలను స్వీకరించిన ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సంబంధాల్లో సాంస్కృతిక వారసత్వం ఒక బలమైన బంధమని అన్నారు. ‘సాధారణంగా ప్రపంచంలో దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుత కాలానికి చెందినవై ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో రెండు దేశాల మధ్య సంబంధాల్లో సాంస్కృతిక వారసత్వం ముఖ్యమైనదిగా ఉంటుంది. ఒక్కోసారి వ్యక్తులు చేయలేని పనులను విగ్రహాలు చేస్తాయి’ అని ఈ కళాఖండాలను భారత్‌కు అప్పగించడానికి వాషింగ్టన్‌లోని బ్లెయిర్ హౌస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ అన్నారు. ఆయన హిందీలో మాట్లాడుతూ గత రెండేళ్ల కాలంలో చాలా దేశాలు ఎంతో ఉదారంగా చోరీకి గురయిన భారతీయ కళాఖండాలను తమ దేశానికి తిరిగి ఇచ్చాయని చెప్పారు. అమూల్యమైన ఈ కళాఖండాలను భారత్‌కు తిరిగి ఇస్తున్నందుకు ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కృతజ్ఞతలు తెలియజేశారు. కొంతమంది ఈ కళాఖండాలను కోట్ల విలువైన వాటిగానే చూడవచ్చు కానీ, భారతీయులు మాత్రం అమూల్యమైన తమ సంస్కృతిలో ఒక భాగంగానే వీటిని చూస్తారని ఆయన చెప్పారు. అమెరికా భారత్‌కు తిరిగిఇచ్చిన కళాఖండాల్లో మత పరమైన దేవుళ్ల విగ్రహాలు, కాంస్య విగ్రహాలు, టెర్రాకోటా కళాఖండాలు ఉన్నాయి. వీటిలో కొన్ని 2 వేల సంవత్సరాల క్రితం నాటివి కూడా ఉన్నాయి.
ఇవన్నీ కూడా దేశంలోని ఆలయాలు లాంటివాటిలో దోచుకున్నవి కాగా చేతులు మారుతూ అమెరికాకు చేరాయి. అత్యంత అరుదైన విగ్రహాల్లో చోళుల కాలానికి చెందిన కవి, అధ్యాత్మిక మేధావి అయిన మానిక్కవిచావాకర్ చెందిన విగ్రహంకూడా ఉంది. చెన్నైలోని శివాలయంనుంచి చోరీకి గురయిన ఈ విహ్రం ఖరీదు ఇప్పుడు 15 లక్షల డాలర్లకు పైగానే ఉంటుందని అంచనా. అలాగే జైన తీర్థంకరుల్లో ఒకరైన బాహుబలి విగ్రహం, వెయ్యేళ్ల నాటి గణేశుడి కాంస్యవిగ్రహం కూడా అమెరికా మన దేశానికి అప్పగించిన వాటిలో ఉన్నాయి.
chitram...
భారత్‌కు అమెరికా అప్పగించిన కళాఖండాలతో ప్రధాని నరేంద్ర మోదీ