అంతర్జాతీయం

మోదీ నాయకత్వం భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 7: భారత దేశంలో అత్యంత సంక్లిష్టమైన రాజకీయ వాతావరణం నెలకొన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రభావశీలత కలిగిన నాయకత్వాన్ని ప్రదర్శించారని వైట్‌హౌస్ ప్రశంసించింది. వాతావరణ మార్పులు నిరోధంసహా అనేక అంశాలపై నరేంద్ర మోదీ పట్టుదలగా వ్యవహరించారని వ్యాఖ్యానించింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మోదీ సమావేశం దృష్ట్యా ఆయన నాయకత్వంపై అనేక అంశాలను వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా పారిస్‌లో జరిగిన వాతావరణ మార్పుల శిఖరాగ్ర సదస్సులో చారిత్రక ఒప్పందం కుదరడానికి భారత్ కీలకపాత్ర పోషించిందని పేర్కొంది. కేవలం భారతీయ ప్రజల ప్రయోజనాలకే కాకుండా మొత్తం ప్రపంచం బాగుకోసమే మోదీ కృషి చేశారని, ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రశంసలు కూడా అందుకున్నారని వైట్‌హౌస్ తెలిపింది.
అణు సరఫరాల దేశాల కూటమి ఎన్‌ఎస్‌జిలో భారత్ సభ్యత్వం పొందేందుకు అన్ని విధాలుగా తోడ్పాను అందిస్తామని అమెరికా స్పష్టం చేసింది. ఎన్‌ఎస్‌జిలో భారత్‌కు సభ్యత్వ ఇవ్వడం వల్ల అణువ్యాప్త నిరోధన తదితర అంశాలపై బలంగా నిలబడే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ఇప్పటికే భారత్‌లో పౌర అణు ఇంధన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని అమెరికా జాతీయ భద్రతా ఉప సలహాదారు బెంజమిన్ రోడ్స్ వెల్లడించారు. ఎన్‌ఎస్‌జిలో భారత్ సభ్యత్వానికి సంబంధించి ఇతర దేశాల మద్దతు సమకూర్చేందుకు తాము గట్టిగా కృషి చేస్తామని జపాన్ కూడా హామీ ఇచ్చింది.

చిత్రం... మంగళవారం వాషింగ్టన్ చేరుకున్న ప్రధాని మోదీతో కరచాలనం చేస్తున్న భారతీయులు. ఆర్లింగ్టన్‌లో అమరవీరులకు నివాళులర్పిస్తున్న మోదీ