అంతర్జాతీయం

జగతి రక్షకులం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

................
మన బంధం ప్రపంచానికే బలం మా పొరుగునే ఉగ్రవాద కుంపటి
విధ్వంసం, విద్వేషమే దాని లక్ష్యం మారుమాట లేకుండా మట్టుబెట్టాలి
ప్రవాస భారతీయులు స్నేహవారధులు మాకు రాజ్యాంగమే పవిత్ర గ్రంథం
అంబేద్కర్‌కు మీ రాజ్యాంగమే స్ఫూర్తి ఉద్వేగ, ఉత్తేజ భరితంగా మోదీ ప్రసంగం
ఆద్యంతం కరతాళ ధ్వనులే మేడిసన్ స్క్వేర్‌ను తలపించిన అమెరికా కాంగ్రెస్
................................

వాషింగ్టన్, జూన్ 8: భారత్-అమెరికా అనుబంధం జగతికే రక్షణ కవచమని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ శాంతి, సుస్థిరాభివృద్ధి, సంపద ఈ రెండు దేశాల మధ్య సహకారం, సయోధ్య పునాదుల పటిష్టతమైనే ఆధారపడి ఉన్నాయన్నారు. లష్కరే తోయిబా, తాలిబన్, ఐసిస్ పేరేదైనా ఉగ్రవాద లక్ష్యం..విధ్వంసం, విద్వేషం, మారణకాండే..నంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సాక్షిగా పాకిస్తాన్‌పై తీవ్ర స్థాయిలో నిప్పులుచెరిగారు. ‘ఉగ్రవాదం మా పొరుగు దేశంలో జవజీవాలు సంతరించుకుంటోంది. ఎలాంటి తారతమ్యం లేకుండా ఈ జాడ్యాన్ని మట్టుబెట్టాల్సిందే’నని ఉద్ఘాటించారు. ఇరు దేశాల సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయన్న అంశాన్ని తనదైన శైలిలో విశే్లషించిన నరేంద్ర మోదీ అమెరికాను ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించారు. మోదీ ప్రసంగం సాగినంత సేపూ అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సభ్యుల హర్షధ్వానాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ఉగ్రవాదాన్ని ఏకోన్ముఖ లక్ష్యంతో ఎదుర్కోవాల్సిందేనని పేర్కొన్న మోదీ రాజకీయ లబ్ధి కోసం తీవ్రవాదాన్ని పెంచిపోషించే వారి పట్ల కఠినంగా వ్యవహరించినందుకు అమెరికా కాంగ్రెస్‌ను అభినందించారు. ఎఫ్-16విమానాలను పాకిస్తాన్‌కు విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ తిప్పికొట్టడాన్ని మోదీ ప్రస్తావించారు. ముప్పావు గంట సేపుఅత్యంత రసవత్తరంగా, మెరుపులు, విరుపులతో సాగిన మోదీ ప్రసంగం అంతర్జాతీయ సవాళ్లు, సమస్యలతో పాటు భారత్-అమెరికాల మధ్య విస్తరిస్తున్న సరికొత్త స్నేహ బంధాన్నీ విశే్లషించింది. రాజ్యాంగమే తమకు పవిత్ర గ్రంధమని పేర్కొన్న మోదీ ప్రజాస్వామ్య విలువలు, హక్కుల పరిరక్షణలో ఇరు దేశాలు ప్రపంచానికే తలమానికంగా నిలిచాయన్నారు. వ్యూహాత్మక మైత్రీ బంధంతో పాటు చారిత్రక పౌర అణు ఇంధన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా ఉభయ దేశాలు అన్ని రంగాల్లోనూ మరింత సన్నిహితమయ్యాయని చెప్పారు. గత వైరుధ్యాలు, అవరోధాలు పక్కన పెట్టి బలమైన, స్థిరమైన పునాదులపై భవిష్యత్ బంధాన్ని బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కుర్తా మైజామా పైన గోధుమ రంగు హాఫ్ జాకెట్ ధరించి అమెరికా కాంగ్రెస్‌లోకి ప్రవేశించిన మోదీకి సభ్యులు ఘన స్వాగతం పలికారు. ముప్పావు గంట సాగిన ఆయన ప్రసంగానికి నలభై సార్లు కేరింతలుకొట్టారు. కొన్ని సార్లు తమతమ సీట్ల నుంచి నిలబడి మరీ కరతాళ ధ్వనులతో సభను మార్మోగించారు. అమెరికాలో స్థిరపడిన భారత సంతతి ప్రజలు ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలకు వారధిగా నిలుస్తున్నారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో మోదీ ప్రసంగం చతురోక్తులతోనే సాగింది. మొత్తం 30మిలియన్ మంది అమెరికన్లు భారతీయ సంప్రదాయమైన యోగా చేస్తున్నారని పేర్కొన్న మోదీ..‘స్పీకర్‌గారూ..మేమేమీ దీనిపై మేధోహక్కులను కోరడం లేదు’అంటూ వ్యంగ్యోక్తి విసిరారు. అలాగే భారత పార్లమెంట్ తీరును కూడా పరోక్షంగా ప్రస్తావించిన ప్రధాని ‘మీరు బైపార్టిసన్‌కు (రాజకీయ పార్టీల మధ్య సహకారం) పెట్టింది పేరు..మా పార్లమెంట్‌లోనూ ఇదే రకమైన సహకార స్ఫూర్తిని నేను చూశాను. ముఖ్యంగా ఇది ఎగువ సభలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది..’అని వ్యాఖ్యానించారు.
భారత్‌కు అమెరికా అనివార్యమైన భాగస్వామ్య దేశమని, భారత్ ఎంత బలంగా ఉంటే..ఎంతగా సుసంపన్నమైతే అంతగానూ అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలు నెరవేరతాయని మోదీ అన్నారు. భారత్‌లో సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయని పేర్కొన్న ఆయన వంద కోట్లు దాటిన భారత జనాభాలో ప్రతి పౌరుడు 2022నాటికల్లా సామాజికంగా, ఆర్థికంగా సుసంపన్నం కావాలన్నదే తన ఆశాయమని చెప్పారు. తన ఆశయాలు సుదీర్ఘమైనవే కాకుండా చిత్తశుద్ధితో కూడుకున్నవేనని తెలిపారు. నార్మన్ బర్లోగ్ దూరదృష్టి కారణంగానే భారత్‌లో సస్య విప్లవం సాకారమైందని, కోటాను కోట్ల మందికి ఆహార భద్రతా చేకూరిందని మోదీ గుర్తు చేశారు. ఇరు దేశాలు తమతమ ఆదర్శాలను వాస్తవాలుగా మార్చుకునే విధంగా సహకారాన్ని విస్తరించుకోవాలన్నారు. భారత్ సహకారాన్ని కోరుకుంటోదే తప్ప ఆధిపత్యాన్ని కాదని, అలాగే అందరితో సన్నిహితమవ్యాలని భావిస్తోందే తప్ప ఏకాకిగా మిగిలి పోవాలని కాదని చెప్పిన మోదీ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత బాధ్యతాయుతంగా భారత్ వ్యవహరిస్తున్న విషయాన్ని అమెరికా కాంగ్రెస్ సభ్యులకు మోదీ వివరించారు. భారత్-అమెరికాలు తమతమ స్వభావాల దృష్ట్యా సహజసిద్ధమైన భాగస్వామ్య దేశాలని తమ మాజీ ప్రధాని వాజపేయి పేర్కొన్నారని గుర్తు చేసిన మోదీ అమెరికా రాజ్యాంగమే భారత రాజ్యాంగ నిర్మాతకు స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. ప్రపంచంలో అత్యంత ప్రాచీన ప్రజాస్వామ్య దేశానుద్దేశించి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రతినిధిగా మాట్లాడటం తనకు గర్వకారణమన్నారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా తాను తిరిగానని..అక్కడి ప్రజల ఆశావహ దృక్పథమే దానికి తిరుగులేని బలమని మోదీ అన్నారు. మరి కొన్ని నెలల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్న ఒబామా తనతో అత్యంత సన్నిహితంగా మెసలిన నేతలను ఒకరొక్కరుగా ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ఒబామా నుంచి అందిన ఆహ్వానం మేరకే భారత ప్రధాని మోదీ తాజా పర్యటన చేపట్టారు.

రాజ్యాంగం
మా పవిత్ర గ్రంధం..
పౌరులకు స్వేచ్ఛే దాని స్ఫూర్తి..

ప్రజాస్వామ్య
దేవాలయం
అమెరికా.. దానితోనే
ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి.

పరస్పర సహకారానికి మీరు పెట్టింది పేరు.. ఇలాంటి స్ఫూర్తే భారత పార్లమెంట్‌లో కనిపిస్తుంది.. ముఖ్యంగా పెద్దల సభలో..

ఉగ్రవాదానికి
పుట్టినిల్లు మా పొరుగు దేశం.. అలాంటి దేశాలకు అమెరికా గట్టి హెచ్చరిక చేయాలి

మన మధ్య సహకారం
అందరికీ రక్షణ కవచం