అంతర్జాతీయం

అభివృద్ధి ఇంజన్.. భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 8: ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటుకు భారత దేశం బలమైన ఇంధనశక్తిగా, ఇంజనుగా పనిచేసేందుకు సంసిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎంతగా విస్తరిస్తే, అంతగానూ ప్రపంచానికి బహుళ ప్రయోజనాలు సిద్ధిస్తాయని బుధవారం ఇక్కడ జరిగిన భారత అమెరికా వ్యాపార మండలి సమావేశంలో స్పష్టం చేశారు. ‘‘ప్రస్తుత ప్రపంచ వృద్ధి రేటును పెంచేందుకు బలమైన ఇంజను కావాలి.. ఆ చోదక శక్తి భారత్‌కు ఉంది’’ అని స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా భారత్‌లోని తన ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు, వివిధ విధానాల సరళీకరణ విషయంలో సాధించిన విజయాలను ఈ సందర్భంగా మోదీ వివరించారు. తమ విధానాల కారణంగానే, వాటి ద్వారా సాధించిన ఉమ్మడి ఫలితాల మూలంగానే భారత దేశం అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారిందన్నారు. భారత్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘‘్భరత దేశాన్ని వ్యాపారానికి అనుకూల మార్గంగానే పరిగణించకండి.. అన్నివిధాలా దాంతో భాగస్వామ్యం కండి’’ అని స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగాన్ని పెంచే బలమైన దేశంగా భారత్ రూపుదిద్దుకోబోతోందని వెల్లడించారు. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లేకొద్దీ భారత్ అమెరికా అనుభవం గురించి కూడా తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉందని ముఖ్యంగా నాయకత్వ పటిమ, సాంకేతిక అభివృద్ధి, ఔషధాల నుంచి డ్రోన్ విమానాల వరకు విస్తరించిన సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకోవటం భారత్‌కు ఎంతో అవసరమన్నారు. అందుకు సంబంధించినంత వరకు అద్భుతమైన చరిత్ర కలిగిన దేశంగానే కాకుండా ఉజ్వల భవిత కలిగిన దేశంగా కూడా అమెరికా కనిపిస్తుందని తెలిపారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం పరస్పరం లబ్ధి చేకూర్చేదని తెలిపారు. అవినీతిని అంతం చేయటానికి తాము నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నామని, అలాగే సూక్ష్మ ఆర్థిక విధానాలను కూడా క్రమశిక్షణాయుత రీతిలో అమలు చేస్తున్నామని తెలిపారు. అన్ని అభివృద్ధి చెందిన దేశాలు తమ మార్కెట్‌ను విస్తరిస్తే అందరికీ లబ్ధి చేకూరుతుందన్నారు. భారత దేశాన్ని వ్యాపార కేంద్రంగానే కాకుండా ఎలాంటి అవరోధాలు లేకుండా పరిశ్రమలు పెట్టేందుకు వీలున్న దేశంగా మార్చాలన్నదే తన లక్ష్యమన్నారు.
మోదీ నాయకత్వం భేష్
భారత అమెరికాల మధ్య మైత్రీబంధాన్ని కొత్త పుంతలు తొక్కించటానికి ప్రధాని నరేంద్రమోదీ అద్భుతమైన నాయకత్వ పటిమను ప్రదర్శించారని అమెరికా కాంగ్రెస్ సభ్యులు ప్రశంసించారు. రెండు దేశాల మధ్య సరికొత్త స్నేహబంధం ఆవిష్కృతమైందన్నారు. అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ, అలాగే సెనేటర్ జాన్ మెకేన్ సహా అనేకమంది మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. దక్షిణాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించటానికి భారత్ అమెరికాల మధ్య మరింతగా సహకారం అవసరమని తెలిపారు.

చిత్రం... భారత్-అమెరికా వ్యాపార మండలి రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ