అంతర్జాతీయం

ఓర్లాండోకు ఒబామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 14: అమెరికా చరిత్రలో అతిపెద్ద కాల్పుల ఘటన జరిగి 50మంది ప్రాణాలను బలిగొన్న ఓర్లాండో నైట్ గే క్లబ్‌ను అధ్యక్షుడు బరాక్ ఒబామా గురువారం సందర్శించనున్నారు. మృతులకు ఆయన నివాళులు అర్పిస్తారు. ఫ్లోరిడా ప్రజలకు ఆయన తన సంఘీభావాన్ని ప్రకటిస్తారు. వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఓర్లాండో ఘటనతో ఒబామా విస్కాన్‌సన్ పర్యటనను రద్దు చేసుకున్నారని తెలిపారు. విస్కాన్సన్‌లో హిల్లరీతో కలిసి ప్రచారంలో ఒబామా పాల్గొనాల్సి ఉంది. ఇలావుండగా, అమెరికాలో తరచూ హింసాకాండకు కారణమవుతున్న గన్ కల్చర్‌ను నియంత్రించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి హక్కుల కమిటీ చీఫ్ జైద్ రాద్ అల్ హుసేన్ అన్నారు.

అమెరికాలో తక్షణం తుపాకీ నియంత్రణ చట్టాన్ని తీసుకురావలసిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.