అంతర్జాతీయం

చట్టం వైఫల్యంవల్లే దేశంలోకి తీవ్రవాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 14: అమెరికాలో వలస చట్టం ఘోరంగా విఫలమైందని, దీనిద్వారానే దేశంలోకి ఇస్లామిక్ తీవ్రవాదం దేశంలోకి దిగుమతి అవుతోందని అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా దాదాపు ఖరారైన డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘దేశంలోకి ఇస్లామిక్ తీవ్రవాదం ఎలా వస్తోందనే దానిపై మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. విఫలమైన వలస విధానం ద్వారానే మనం దేశంలోకి ఇస్లామిక్ తీవ్రవాదాన్ని దిగమతి చేసుంటున్నాం. ఇంటెలిజన్స్ వ్యవస్థ సైతం ఘోరంగా విఫలమైంది. అయినా మన అధ్యక్షుడు వారిని వెనకేసుకు వస్తున్నారు’ అని అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా దాదాపు ఖరారయిన తర్వాత ఉగ్రవాదం, జాతీయ భద్రతపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ట్రంప్ అన్నారు. ఓర్లాండోలోని నైట్‌క్లబ్‌పై ఉగ్రవాది దాడి చేసి సుమారు 50 మందిని పొట్టన పెట్టుకున్న సంఘటన జరిగిన రెండు రోజులకు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వలస విధానం విఫలం కావడంతో దేశంలోకి ఎవరు వస్తున్నారో మనకు తెలియడం లేదు. నేను అధ్యక్షుడిగా ఎన్నికకాపోతే మరో నాలుగేళ్లు ఇది మారదు. అయితే ఇది మారి తీరాలి. ఇది ఇప్పుడే మారాలి’ అని న్యూహాంప్‌షైర్‌లో ప్రసంగిస్తూ ట్రంప్ అన్నారు. ‘ఈ సమస్యపై ఇక ఎంతమాత్రం మాట్లాడకుండా ఉండలేము. దీన్ని ఇప్పుడే పరిష్కరించాలి. బెర్నార్డినో సంఘటన తర్వాత ముస్లింల ప్రవేశంపై నిషేధించాలని నేను కోరాను, అయితే అప్పుడు చూసి అందరూ కోపగించారు, నవ్వారు. అయితే ఇప్పుడు నేను కరెక్టే అంటున్నారు. ముస్లింల రాకపై శాశ్వత పరిష్కారం కనుగొనాలి’ అని ట్రంప్ అన్నారు.

అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జన్మదినోత్సవం సందర్భంగా మంగళవారం ఢిల్లీలో ఆయన చిత్రపటానికి కేకును తినిపిస్తున్న
హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్త