అంతర్జాతీయం

మతిన్ భార్యకు ముందే తెలుసు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూన్ 15: ఒర్లాండో నైట్ గే క్లబ్‌పై విచక్షణ లేకుండా కాల్పులకు తెగబడి 50మంది ప్రాణాలను బలిగొన్న ఒమర్ మతిన్ భార్య క్రిమినల్ ఆరోపణలను ఎదుర్కొనే అవకాశాలున్నట్లు సమాచారం. మతిన్ ఆయుధాలు కొనుగోలు చేసినప్పుడు అతని భార్య నూర్ జాహి సల్మాన్ కూడా ఉన్నట్లు ఎఫ్‌బిఐ విచారణలో తేలింది. అంతేకాకుండా కాల్పుల దురాగతానికి పాల్పడటానికి ముందు మతిన్‌తోపాటు సల్మాన్ కూడా ఒకసారి గే క్లబ్‌కు వెళ్లి వచ్చింది. దాడికి సంబంధించి సల్మాన్ తన భర్తతో మాట్లాడేందుకు ప్రయత్నించిందని కూడా ఎన్‌బిసి న్యూస్ పేర్కొంది. 30 ఏళ్ల సల్మాన్ గే క్లబ్‌పై దాడికి సంబంధించిన సమాచారం తెలిసికూడా పోలీసులకు తెలియజేయకపోవటంతో ఆమెపై క్రిమినల్ చార్జీలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ఒర్లాండో నైట్ గే క్లబ్‌పై దాడి చేసి 50 మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఎఫ్‌బిఐ అధికారులు సల్మాన్‌ను విచారించినప్పుడు ఆమె తన భర్త దాడికి సంబంధించిన ప్రణాళిక ఏవిధంగా రచించిందీ వెల్లడించినట్లు సిఎన్‌ఎన్ తెలిపింది.