అంతర్జాతీయం

తుది ప్రైమరీలోనూ హిల్లరీ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 15: అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రాట్ల నామినీగా హిల్లరీ క్లింటన్ అభ్యర్థిత్వం ఖరారైంది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో బుధవారం జరిగిన తుది ప్రైమరీలో హిల్లరీ తన ప్రత్యర్థి బెర్నీ శాండర్స్‌పై విజయం సాధించారు. దీంతో అధ్యక్ష పదవికి నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై పోటీకి హిల్లరీ సమాయత్తమవుతున్నారు. వాషింగ్టన్ ప్రైమరీలో హిల్లరీ 78.9 శాతం ఓట్లు సంపాదించుకున్నారు. శాండర్స్‌కు కేవలం 21.1శాతం ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో అమెరికా అధ్యక్షపదవికి పోటీ చేస్తున్న మొట్టమొదటి మహిళా అభ్యర్థిగా హిల్లరీ రికార్డు సృష్టించారు. వాషింగ్టన్ ప్రైమరీ ఎన్నిక పూర్తికాగానే శాండర్స్, క్లింటన్‌ల మధ్య సమావేశం అయింది. ఇద్దరి మధ్య సానుకూల సంభాషణలు జరిగినట్లు శాండర్స్ ప్రతినిధి మైకేల్ బ్రిగ్స్ తెలిపారు. శాండర్స్ క్లింటన్‌కు అభినందనలు తెలిపినట్లు ఆయన వివరించారు. అమెరికా అభివృద్ధికి ఇద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్ తన 70వ పుట్టిన రోజును బుధవారం జరుపుకున్నారు.
గాయపడ్డవారిని షిల్లాంగ్ ఆసుపత్రికి తరలించి వైద్యసేవలందిస్తున్నారు. మేఘాలయ రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులను కోల్పోయినవారు త్వరగా కోలుకోవాలంటూ మోదీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.