అంతర్జాతీయం

రోదసిలో జీవ సంకేతాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 15: ఈ సృష్టిలో జీవావిర్భావం ఎలా జరిగింది? ఒక్క భూమీదే సమస్త జీవరాశి ఆవిర్భవించటానికి మూలం ఏమిటి అన్నది శతాబ్దాలుగా మానవ మేధస్సును దొలిచేస్తున్న ప్రశ్న. ఈ దిశగా అనేక పరిశోధనలు జరిగినప్పటికీ, తాజాగా అంతరిక్షంలో అదీ గ్రహాల మధ్య భాగంలో తొలిసారిగా కేంద్రీయ కణాన్ని పోలిన ఆధారాలను కనుగొన్నారు. ఈ సంక్లిష్ట సేంద్రీయ కణాలు జీవ ఉద్భవానికి అత్యంత కీలకం. ఈ తాజా ఆవిష్కరణ సమస్త సృష్టిలో జీవి ఎలా ఆవిర్భవించిందన్న దానిపై మరింత లోతుగా అధ్యయనానికి ఆస్కారమిచ్చిందని చెప్తున్నారు. ఈ సేంద్రీయ కణాలు మానవ చేతులను పోలి ఉన్నాయని, ఈ రకమైన మాలిక్యూల్స్ అనేక ఉల్కల మీద, తోకచుక్కల ఉపరితలం మీద, భూమీద పడ్డ అనేక రోదసీ పదార్థాలు కనిపించాయని చెప్తున్నారు. అయితే అంతరిక్షంలో ఈ రకమైన సేంద్రీయ కణాలను పోలిన ఆనవాళ్లు కనిపించటం ఇదే మొదటిసారి. అత్యంత శక్తివంతమైన రేడియో టెలిస్కోప్‌లను ఉపయోగించి ఈ మాలిక్యూల్స్‌ను కనుగొన్నారు. ప్రోఫిలీమ్ ఆక్సైడ్‌ను (సిహెచ్3, సిహెచ్‌ఓ, సిహెచ్2) శాజిటారియస్ అనే నక్షత్రమండలం చుట్టూ ఆవరించిన దుమ్మూ ధూళిలో కనుగొన్నామని, ఇది మన సౌర వ్యవస్థ మధ్యభాగానికి సమీపంలోనే కనిపించిందని వెల్లడించారు. ఈ దిశగా పరిశోధనలు మరింత ముందుకు వెళ్తే జీవావిర్భావ రహస్యాలను కరతలామలకం చేసుకోవచ్చని చెప్తున్నారు. ఇప్పటివరకు 180కి పైగా మాలిక్యూల్స్‌ను రోదసిలో గుర్తించారు. ప్రతి మాలిక్యూల్ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నదని నిర్ధారించారు.