అంతర్జాతీయం

సియోల్ అజెండాలోనే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్ / న్యూఢిల్లీ, జూన్ 20: అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో సభ్యత్వం పొందేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలిగిందా? సియోల్‌లో సోమవారం నుంచి మొదలైన 48 దేశాల ఎన్‌ఎస్‌జి ప్లీనరీ సమావేశ అజెండాలో భారత్‌కు సభ్యత్వం ఇచ్చే ప్రతిపాదన లేదని చైనా స్పష్టం చేసింది.
భారత్‌కు సభ్యత్వం మాట ఎలా ఉన్నా కనీసం అజెండాలో కూడా ఈ ప్రస్తావన లేదని చైనా చెప్పడం గమనార్హం. ఇప్పటికీ కూడా అణు వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని భారత్ వంటి దేశాలకు ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం కల్పించాలా, వద్దా? అన్నదానిపై సభ్యదేశాలు నిలువునా చీలిపోయాయని చైనా వెల్లడించింది. ఎన్‌ఎస్‌జి సభ్యత్వం విషయంలో ఎలాగైనా చైనాను ఒప్పిస్తామని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించి 24 గంటలు తిరగకుండానే అసలు సియోల్ అజెండాలో భారత్‌కు సభ్యత్వం కల్పించాలన్న ప్రతిపాదన లేదని చైనా చెప్పడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఎన్‌టిపిపై సంతకం చేయని దేశాలకు ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో ఇందులో భారత్‌ను చేర్చుకునే అంశం చర్చనీయాంశమే కాదని ఆ పరిణతికి ఈ అంశం రాలేదని చైనా విదేశాంగ విభాగం ప్రతినిధి చున్‌యింగ్ బీజింగ్‌లో తెలిపారు.
అయితే చైనా కేవలం ఎన్‌ఎస్‌జి సభ్యత్వ ప్రాధాన్యతలు గురించి, విధానాల గురించే మాట్లాడిందని వీటిని చర్చలు ద్వారా పరిష్కరించుకుంటామని సుష్మా స్వరాజ్ స్పష్టం చేసినప్పటికీ చైనా వైఖరిలో ఏరకమైన మార్చు వచ్చిన దాఖలాలు లేవు. కాగా చైనా విదేశాంగ ప్రతినిధి చేసిన తాజా ప్రకటనను భారత్ అధికారులు కొట్టివేశారు. ఇప్పటికీ కూడా ఎన్‌ఎస్‌జిలో భారత్‌కు సభ్యత్వం వస్తుందన్న నమ్మకం, ధీమా తమకు ఉన్నాయని వారంటున్నారు.

అత్యంత శక్తిమంతమైన
సూపర్ కంప్యూటర్ చైనాదే

బీజింగ్, జూన్ 20: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్‌గా చైనాకు చెందిన ఒక కొత్త కంప్యూటర్ సిస్టమ్ నిలిచింది. సన్‌వే-టైహులైట్‌గా పిలవబడే ఈ సూపర్ కంప్యూటర్ ఒక సెకనుకు 93 క్వాడ్రిలియన్స్ లెక్కలను పూర్తిచేస్తుంది. చైనాలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ పారల్లల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజి (ఎన్‌ఆర్‌సిపిసి) ఈ సూపర్ కంప్యూటర్‌ను అభివృద్ధి చేసింది. ఈ సూపర్ కంప్యూటర్‌ను పూర్తిగా చైనాలో డిజైన్ చేసి, తయారు చేసిన ప్రాసెసర్లను వినియోగించి రూపొందించినట్లు చైనా అధికార వార్తాసంస్థ తెలిపింది. తాజాగా జర్మనీలో జరిగిన 2016 అంతర్జాతీయ సూపర్ కంప్యూటింగ్ సదస్సులో ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 500 సూపర్ కంప్యూటర్లలో సన్‌వే టైహులైట్ ప్రథమ స్థానంలో నిలిచిందని వివరించింది. సెకనుకు 125.436 పెటాఫ్లాప్స్ (పిఫ్లాప్స్) ప్రాసెసింగ్ సామర్థ్యం గల సన్‌వే టైహులైట్.. 100 పిఫ్లాప్స్ కన్నా అధిక వేగం గల తొలి సూపర్ కంప్యూటర్‌గా నిలిచింది. చైనా అభివృద్ధి చేసిన కేవలం 25 చదరపు సెంటీ మీటర్ల వైశాల్యం గల మెనీ-కోర్ సిపియు చిప్‌ను ఈ సూపర్ కంప్యూటర్‌కు వినియోగించారు. చైనాలోని నేషనల్ సూపర్ కంప్యూటింగ్ సెంటర్‌లో ఉన్న ఇంటెల్ ఆధారిత చైనా సూపర్ కంప్యూటర్‌ను తొలగించి, దాని స్థానంలో ఈ సన్‌వే టైహులైట్‌ను ఇన్‌స్టాల్ చేశారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 500 సూపర్ కంప్యూటర్లలో గత ఆరుసార్లు టియానె్హ-2 అగ్ర స్థానంలో నిలవడం విశేషం. ఏడాదికి రెండుసార్లు ఈ శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ల జాబితాను ప్రకటిస్తుంటారు.