అంతర్జాతీయం

యోగకు నిలువెత్తు దర్పణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూన్ 20: రెండో అంతర్జాతీయ యోగ దినోత్సవానికి ప్రధాన వేదిక అయిన ప్రపంచశాంతి సంస్థ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం యోగకు మహారాజయోగన్ని పట్టించింది. ‘పర్వతాసనం’వేసిన మహిళ భంగిమను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంపై వెలుగొందేలా విద్యుత్ కాంతులతో చిత్రాన్ని ఏర్పాటు చేశారని సమితిలో భారత దౌత్యవేత్త అక్బరుద్దీన్ సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఇక్కడ జరిగే యోగ కార్యక్రమంలో జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు మోర్గెన్స్ లిక్కెటాఫ్, ప్రజాసంబంధాల సమాచార విభాగం అండర్ సెక్రటరీ జనరల్ క్రిస్టీనా గల్లాక్, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్‌లు పాల్గొంటున్నారు. ప్రముఖ బ్రిటిష్ గాయని తాన్యా వెల్స్ ఈ కార్యక్రమంలో సంస్కృత శ్లోకాలు పఠిస్తారు. యోగ కేవలం భౌతిక, శారీరకంగానే కాక, సుస్థిర లక్ష్యాలను సాధించే దిశగా ఏ విధంగా సహకరిస్తుందనేది ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అక్బరుద్దీన్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దాదాపు వంద దేశాల నుంచి పౌరులు రిజిస్టర్ చేసుకున్నారన్నారు. భారత దౌత్య కార్యాలయం యోగ మాస్టర్లతో చర్చావేదికను కూడా ఏర్పాటు చేసింది. 13 దేశాల్లో శాంతి రక్షణ చర్యల్లో పాల్గొంటున్న శాంతి పరిరక్షక దళాలు యోగ కార్యక్రమంలో భాగస్తులవుతున్నాయని అక్బరుద్దీన్ వివరించారు. మందిరాల్లో, పాఠశాలల్లోనూ నిర్వహిస్తున్నారని వివరించారు.
టెక్సాస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
హోస్టన్: మరోవైపు టెక్సాస్‌లోనూ అంతర్జాతీయ యోగ దినోత్సవంలో పాల్గొనేందుకు యువత ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. యోగ మ్యాట్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. భార త దౌత్యకార్యాలయం, ప్రళయ యోగ స్టూడియో, పతంజలి యోగపీఠంతో పాటు హోస్టన్ యోగ పాఠశాలలు అంతర్జాగీయ యోగ దినోత్సవం నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశాయి.