అంతర్జాతీయం

ఈయూలోనే ఉందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 22: యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ ఉండాలా, వద్దా? అన్న అంశంపై ఓటింగ్‌కు 24గంటల ముందు ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్రజలకు చివరి విజ్ఞప్తి చేశారు. 28 దేశాల యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగవద్దని, అందులో భాగంగా ఉంటేనే ప్రపంచానికి, తమకూ మంచిదని కామెరాన్ స్పష్టం చేశారు. ఐరోపా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈయూలోనే బ్రిటన్ కొనసాగేందుకు అనుకూలంగా ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరోపక్క ఈయూలో ఉండాలనే వర్గంలో 1280 మంది వ్యాపారవేత్తలు, 100 కంపెనీల ప్రతినిధులు హెచ్చరిక చేశారు. ‘ఈయూ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లడం అంటే ఆర్థిక అస్థిరతను ఆహ్వానించటం, ఉద్యోగాలను ప్రమాదంలోకి నెట్టడమే’నని ఒక బహిరంగ లేఖను తమ సంతకాలతో విడుదల చేశారు. ఈ లేఖపై సంతకం చేసిన వారిలో 900మంది చిన్న వ్యాపారులే ఉండటం విశేషం. ఈయూను బ్రిటన్ వీడిపోతే తమ సంస్థల పరిస్థితి దారుణంగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారరంగంలో మెజారిటీ వర్గం ఈయూలో బ్రిటన్ కొనసాగాలనే కోరుకుంటోందని ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. మరో అభిప్రాయ సేకరణలో 45శాతం ఉండాలని, 44శాతం వీడిపోవాలని కోరుకున్నారు. ఈ పోల్ సర్వేలో 11శాతం మంది ఎటూ తేల్చుకోలేదు. వ్యాపార వర్గం మద్దతును ప్రధాని కామెరాన్ ఆహ్వానించారు. ‘ఐరోపా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అతి పెద్ద సింగిల్ మార్కెట్‌గా ఉంది. దాదాపు 500 మిలియన్ డాలర్ల వ్యాపారం చేయటమే కాకుండా ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి దీనివల్లే సాధ్యమైంది. మరింత మెరుగైన వ్యాపార ఒప్పందాల విషయంలో బ్రిటన్ ఐరోపాకు సహాయకారిగా ఉంటుంది. అయితే మన ప్రత్యేక హోదాను మనం పరిరక్షించుకుంటాం’’ అని వ్యాఖ్యానించారు.